
మాస్ మహారాజా రవితేజ కెరీర్ లో మళ్ళీ సూపర్ స్పీడ్ ను అందుకున్నాడు. ఈ ఏడాది క్రాక్ ఇచ్చిన విజయం రవితేజను మరింత ఉత్సాహంగా పనిచేసేలా చేసింది. రమేష్ వర్మ దర్శకత్వంలో ఖిలాడీ చిత్రాన్ని దాదాపు పూర్తి చేసాడు. అలాగే శరత్ మండవ దర్శకత్వంలో సినిమా షూటింగ్ మొదలుపెట్టాల్సి ఉంది. అలాగే త్రినాథరావు నక్కిన దర్శకత్వంలో మరో సినిమాను లైన్లో పెట్టాడు రవితేజ.
ఇవన్నీ కాకుండా అనిల్ రావిపూడితో ఒక సినిమా, మారుతితో మరో సినిమా కూడా చర్చల దశలో ఉన్నాయి. అనిల్ రావిపూడితో రాజా ది గ్రేట్ చిత్రంలో నటించాడు రవితేజ. ఇప్పుడు చేయబోతున్న సినిమా దానికి సీక్వెల్ అన్న వార్తలు వచ్చాయి. అయితే తాజాగా తెలుస్తోన్న విషయం ఏమిటంటే ఈ చిత్రం సీక్వెల్ కాదట మల్టీస్టారర్ అని తెలుస్తోంది. రవితేజతో పాటు ఈ చిత్రంలో మరో యంగ్ హీరో నటిస్తాడని సమాచారం.
అయితే ఆ యంగ్ హీరో ఎవరు అనేది మాత్రం ఇంకా ఖరారు కాలేదు. అనిల్ రావిపూడి ప్రస్తుతం ఎఫ్3 పూర్తి చేసే పనిలో ఉన్నాడు. దాని తర్వాత బాలకృష్ణతో సినిమా ఉంటుంది. అది అయ్యాక ఈ ప్రాజెక్ట్ పట్టాలెక్కే అవకాశాలు ఉన్నాయి.