Homeన్యూస్'మా' అధ్యక్ష పదవికి తెలుగు వారి పనికిరారా.. రవిబాబు సంచలన కామెంట్స్..!

‘మా’ అధ్యక్ష పదవికి తెలుగు వారి పనికిరారా.. రవిబాబు సంచలన కామెంట్స్..!

Ravibabu Sensationa Comments on MAA Elections Prakash Raj Manchu Vishnu
 

మూవీ ఆర్టిస్ట్ అసొసియేషన్ ఎలక్షన్స్ దగ్గర పడుతున్న టైం లో ప్రకాష్ రాజ్ వర్సెస్ మంచు విష్ణు ల మధ్య మాటల యుద్ధం తారాస్థాయికి చేరింది. మంచు విష్ణు తెలుగు వాదం కొంతమేరకు పనిచేసిందని చెప్పాలి. అందుకే ముందు ప్రకాష్ రాజ్ ప్యానల్ గెలిచేందుకు బలంగా అనిపించగా ఇప్పుడు మంచు విష్ణు ప్యానల్ గెలిచే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయని అంటున్నారు.

ఇదిలాఉంటే మంచు విష్ణు ప్యానల్ కు ఇన్ డైరెక్ట్ గా సపోర్ట్ చేస్తూ సంచలన వ్యాఖ్యలు చేశారు డైరక్టర్ కం యాక్టర్ రవి బాబు. మన క్యారక్టర్ ఆర్టిస్టులకు వేషాలివ్వకుండా.. ఇతర భాషల నుండి నటులను తెచ్చుకుంటున్నారని ఆయన అన్నారు. హైదరాబాద్ లో 150 నుండి 200 మంది కెమెరా మెన్లు ఖాళీగా ఉంటున్నారని.. వారిని కాదని ఇతర ప్రాంతాల వారిని కెమెర మెన్లు తీసుకొస్తున్నారని రవి బాబు అన్నారు. ఇదంతా ప్రొడ్యూసర్స్ చాయిస్ అని.. నిర్మాతలు ఎవరికి నచ్చిన టెక్నిషియన్స్ వారు తెచ్చుకున్|ఏ అవకాశం ఉందని అన్నారు. అయితే సినిమాల్లోనే కాకుండా ఇప్పుడు మా ఎన్నికల్లో కూడా బయట వారిని నిలబెడుతున్నారని ఇన్ డైరెక్ట్ గా ప్రకాష్ రాజ్ పై కౌంటర్ వేశాడు రవి బాబు.

- Advertisement -

‘మా’ అధ్యక్షుడిగా తెలుగు వారిని ఎన్నుకోవాలని రవిబాబు అన్నారు. తెలుగు నటుల కోసం ఏర్పాటు చేసుకున్న మా సంస్థ.. అలాంటి సంస్థను నడిపించేందుకు మనలో ఒకరైన పనికిరారా అంటూ ప్రశ్నించారు రవి బాబు. మొత్తానికి రవి బాబు కామెంట్స్ కు ప్రకాష్ రాజ్ ప్యానల్ మరింత రిస్క్ లో పడే అవకాశం ఉందని చెప్పొచ్చు.

- Advertisement -
Advertisement
Advertisement

టాప్ స్టోరీస్

View All
Advertisement

గాసిప్స్

View All