
క్రేజీ హీరో మాస్ మహారాజ్ రవితేజ ట్రాక్ మారుస్తున్నారా? అంటే అవుననే సమాధానం వినిపిస్తోంది. వి.ఐ. ఆనంద్ డైరెక్షన్‌లో ప్రయోగాత్మకంగా చేసిన `డిస్కోరాజా` ఆశించిన స్థాయిలో బాక్సాఫీస్ వద్ద ప్రేక్షకుల్ని ఆకట్టుకోలేకపోయింది. దీంతో పంథా మార్చుకున్న మాస్ రాజా రవితేజ ప్రస్తుతం వరుస చిత్రాల్ని అంగీకరిస్తున్నారు.
సీనియర్ హీరోయిన్‌లతో కాకుండా అప్‌కమింగ్ హాటీలతో కలిసి నటించాలనుకుంటున్నాడట. ప్రస్తుతం రమేష్ వర్మ దర్శకత్వంలో ఏ స్టూడియో బ్యానర్‌పై హవీష్, కోనేరు సత్యనారాయణ సంయుక్తంగా ఓ భారీ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. త్వరలో ఈ మూవీ షూటింగ్ త్వరలోనే ప్రారంభం కానుంది. ఇందులో ఇద్దరు హీరోయిన్‌లు నటించనున్నారట. ఒక హీరోయిన్‌గా `ఇస్మార్ట్ శంకర్` భామ నిధి అగర్వాల్ ని తీసుకున్నారు. మరో హీరోయిన్ కూడా అప్ కమింగ్ హీరోయిన్‌నే తీసుకోవాలని చూస్తున్నారట.
రవితేజ ప్రస్తుతం `క్రాక్` చిత్రంలో నటిస్తున్నారు. గోపీచంద్ మలినేని దర్శకత్వంలో బి. మధు నిర్మిస్తున్నారు. శృతిహాసన్ హీరోయిన్‌గా నటిస్తోంది. శృతికిది తెలుగులో రీఎంట్రీ మూవీ. ఇటీవలే ఈ చిత్రానికి సంబంధించిన టీజర్ సినిమాపై అంచనాల్ని పెంచేసింది. మే 8న ఈ చిత్రాన్ని రిలీజ్ చేయాలని ప్లాన్ చేశారు. కానీ ఆ డేట్ మారబోతోంది.