Homeటాప్ స్టోరీస్ఉగాది కానుకగా నేల టిక్కెట్ ఫస్ట్ లుక్ ని విడుదల చేసిన రవితేజ

ఉగాది కానుకగా నేల టిక్కెట్ ఫస్ట్ లుక్ ని విడుదల చేసిన రవితేజ

Maharaja Ravi Teja has revealed the first look ఎస్ఆర్‌టి ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్‌పై సోగ్గాడే చిన్నినాయనా, రారండోయ్ వేడుక చూద్దాం లాంటి సూపర్ హిట్ చిత్రాల దర్శకుడు కళ్యాణ్‌కృష్ణ దర్శకత్వంలో, రాజా ది గ్రేట్‌తో అదరగొట్టిన మాస్ మహారాజా ‘రవితేజ’ హీరోగా రామ్ తాళ్లూరి గారు నిర్మిస్తున్న సినిమా ఫస్ట్ లుక్‌ని తెలుగువారి మొదటి పండుగ ఉగాది సందర్భంగా హీరో రవితేజ ట్విట్టర్ ద్వారా విడుదల చేశారు. క్లాస్ మాస్ మేళవింపుతో ఫ్యామిలీ యాక్షన్ ఎంటర్టైనర్ గా రూపుదిద్దుకుంటున్న ఈ చిత్రానికి “నేల టిక్కెట్టు” పేరు ఖరారు చేశారు.

 

- Advertisement -

రవితేజ సరసన మాళవిక శర్మ హీరోయిన్‌గా నటిస్తున్న ఈ చిత్రంలో జగపతిబాబు, బ్రహ్మానందం, జయప్రకాశ్, రఘుబాబు, సుబ్బరాజు, ఆలి, పోసాని కృష్ణమురళి, అన్నపూర్ణమ్మ, ప్రియదర్శి, ప్రభాస్ శ్రీను, పృథ్వీ, సురేఖా వాణి, ప్రవీణ్ తదితరులు ముఖ్య పాత్రలు పోషిస్తున్నారు.

 

దాదాపు 60% షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ చిత్రాన్ని మే 24న విడుదల చేయాలని నిర్మాతలు అనుకుంటున్నారు. ఫిదా ఫేం శక్తికాంత్ కార్తీక్ సంగీతం, ఛోటా కే ప్రసాద్ కూర్పు, బ్రహ్మ కడలి కళ, ముఖేష్ ఛాయాగ్రహణం సమకూరుస్తున్నారు.

- Advertisement -
Advertisement
Advertisement

టాప్ స్టోరీస్

View All
Advertisement

గాసిప్స్

View All