Homeటాప్ స్టోరీస్అందుకే పెద్ద హీరోల జోలికి పోలేదు...నా సినిమాలో కథే పెద్ద హీరో...

అందుకే పెద్ద హీరోల జోలికి పోలేదు…నా సినిమాలో కథే పెద్ద హీరో…

అందుకే పెద్ద హీరోల జోలికి పోలేదు...నా సినిమాలో కథే పెద్ద హీరో...
అందుకే పెద్ద హీరోల జోలికి పోలేదు…నా సినిమాలో కథే పెద్ద హీరో…

తెలుగు పరిశ్రమలో ఒక సినిమాకి ఇంకొక సినిమాకి సంబంధం లేకుండా సినిమాలు చేసుకుంటూ వెళ్లే దర్శకుల్లో ఇద్దరు ఉంటారు. మొదట ‘రామ్ గోపాల్ వర్మ‘ తర్వాత ‘రవిబాబు‘ గారు. రామ్ గోపాల్ వర్మ గారి సినిమా కథలు ఒక వ్యక్తిని గాని, వ్యవస్థని బట్టి ఉంటాయి. రవి బాబు గారి సినిమాలు అందుకు విరుద్ధం గా జనాల మెప్పు మేరకు ఆడుతాయి.

రవి బాబు గారు చేసిన సినిమాలు అల్లరి, పార్టీ, అమ్మాయిలు అబ్బాయిలు వంటి కామెడీ ప్రధానంగా సాగే సినిమాలు ఉన్నాయి. అనసూయ, అవును, అవును 2 వంటి వైవిధ్యమైన సినిమాలు కూడా ఉన్నాయి. లడ్డు బాబు, అవును 2, అదుగో సినిమాలు వరుసగా విఫలం అయ్యాయి. కొత్త సినిమా ‘ఆవిరి’ విడుదలకి సిద్ధంగా ఉంది. ఇక ప్రమోషన్స్ లో పాల్గొన్న రవి బాబు గారిని ఇంటర్వ్యూ లో మీరు ఇంతవరకు పెద్ద హీరోలతో సినిమాలు ఎందుకు చెయ్యలేదు అని అడిగితే వింతగా సమాధానం ఇచ్చారు.

- Advertisement -

”అవును నేను ఇప్పటివరకు పెద్ద హీరోలతో చెయ్యలేదు. నాకు నాగార్జున గారితో ఒక సినిమా చెయ్యాలి అని ఒక కోరిక ఉండేది, కానీ కథ కుదరక చేయలేకపోయాను, అలాగే నన్ను బాలకృష్ణ గారు ఎప్పుడు ‘నాతో సినిమా ఒక సినిమా ప్లాన్ చెయ్యమని’అడిగేవారని నాతో అంత సాన్నిహిత్యంగా ఉండేవారని” చెప్పారు. ఇంటర్వ్యూ లో అడిగిన ప్రశ్నలకి అలా ఇద్దరు హీరోలతో చెయ్యలేకపోయాను, ఇక ముందు అవకాశం వస్తే తప్పకుండా చేస్తా అని అన్నారు.

ఇంకా మాట్లాడుతూ మన తెలుగు సినిమాల విషయంలో కొంతంది దర్శకులు హీరోలని ఉద్దేశించి కథలు రాసుకునేవారు. అది మంచి పద్ధతి కాదు నాకు అలా రాయడం నచ్చదు. నేను మొత్తం కథ రాసుకున్న తర్వాతనే దానికి ఎవరు సరిగ్గా సూట్ అవుతారు అని ఆలోచిస్తా అన్నారు. నిజానికి రవి బాబు గారు చెప్పిన దాంట్లో చాలా నిజం ఉంది ఆయన సినిమా కథలే అందులో హీరో ఎవరు వారి పరిధి ఎంతవరకు మెప్పిస్తారు అని డిసైడ్ చేస్తుంది. ఇలా వైవిధ్యమైన సినిమాలు చేస్తున్న రవి బాబు గారికి ‘ఆవిరి’ సినిమా ఊపిరిని ఇస్తుందా? లేదా అన్నది సినిమా విడుదల రోజు వచ్చే రివ్యూ ని బట్టి ఉంటుంది.

- Advertisement -
Advertisement
Advertisement

టాప్ స్టోరీస్

View All
Advertisement

గాసిప్స్

View All