
క్రీడా నేపధ్యంలో ఇప్పటికీ చాలా విజయవంతమయిన సినిమాలు వచ్చాయి. తెలుగులో కూడా మెగాస్టార్ చిరంజీవి విజేత దగ్గరనుండి నేచురల్ స్టార్ నాని రీసెంట్ హిట్ మూవీ “జెర్సీ” వరకూ ప్రతీ చిత్రాన్ని తెలుగు ప్రేక్షకులు ఆదరించారు. అందులోనూ ఒక ఆట ని మెయిన్ బ్యాక్ డ్రాప్ లో తీసుకుని, దానికి హ్యూమన్ ఎమోషన్స్ జతచేసి సినిమాలు తియ్యడం, లేదంటే ఒక సామాజిక సమస్యను దానితో కలిపి కథ చెప్పడం ఒక ట్రెండ్ గా మారింది.
ఇక ఇప్పుడు ఖో – ఖో ఆట నేపధ్యంలో జాకట రమేష్ దర్శకత్వంలో సిద్దు హీరోగా “రథెరా” అనే సినిమా రిలీజ్ కి సిద్దమయింది. పూల సిద్దేశ్వర రావు, నరేష్ యాదవ్, వై.ఎస్. కృష్ణమూర్తి ఈ సినిమా నిర్మాతలు. జనవరి 1న ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. ఇక ఈ సినిమా కథ విషయానికి వస్తే,
ఒక ఖో – ఖో కోచ్.. కొంతమంది పిల్లలను ట్రెయిన్ చెయ్యడం; అనుకోకుండా జరిగిన ప్రమాదంలో సరైన జాగ్రత్త తీసుకోకపోవడం వల్ల ఒక పిల్లవాడు చనిపోవడం; ఆ తర్వాత ఆ కోచ్ ఎదుర్కొన్న పరిస్థితులు, కష్టాలు చూపించారు. సచిన్ టెండూల్కర్ కూడా ఖో – ఖో ఆడే వాడు అనీ; ఇక ఖో – ఖో ఆట గొప్పతనం గురించి చెప్పిన డైలాగ్ ఇంట్రెస్ట్ క్రియేట్ చేస్తోంది. ఈ సినిమా విజయవంతం కావాలని కోరుకుందాం.