Homeటాప్ స్టోరీస్వచ్చే జన్మలో ఆలా పుట్టాలనీ కోరుకుంటున్న రష్మిక

వచ్చే జన్మలో ఆలా పుట్టాలనీ కోరుకుంటున్న రష్మిక

Rashmika who wants to be born like that in the next life

పుష్ప సినిమాతో పాన్ లెవల్లో గుర్తింపు తెచ్చుకున్న రష్మిక..తాజాగా ఓ ఇంటర్వ్యూ లో వచ్చే జన్మలో ఆడపిల్ల గా పుట్టకూడదని, మగవాడిగా పుట్టాలనీ కోరుకుంది. ఎందుకు ఆలా అన్నదో ఇప్పుడు చూద్దాం. ప్రస్తుతం ఈ భామ తెలుగు తో పాటు హిందీ , తమిళ్ భాషల్లో కూడా పలు సినిమాలు చేస్తూ కెరియర్ ను జెట్ స్పీడ్ గా తీసుకెళ్తుంది. ఈ భామ నటించిన సినిమాలు కూడా బాక్స్ ఆఫీస్ వద్ద భారీ విజయాలు సాధించడం తో హీరోలు , నిర్మాతలు అమ్మడి కాల్ షీట్స్ కోసం పోటీపడుతున్నారు. ఇక తెలుగు లో ఈమె నటించిన తాజా చిత్రం ఆడవాళ్లు మీకు జోహార్లు.

శర్వానంద్ హీరోగా నటించిన ఈ చిత్రంలో రష్మిక హీరోయిన్. కిషోర్ తిరుమల డైరెక్షన్లో రూపుదిద్దుకున్న ఈ మూవీ రేపు ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. ఈ క్రమంలో చిత్ర ప్రమోషన్లలో పాల్గొన్న ఈమె వ‌చ్చే జ‌న్మ‌లో మాత్రం ఆడ‌పిల్ల‌గా పుట్టాల‌ని అనుకోవ‌డం లేద‌ని, మ‌గ పిల్ల‌వాడిగానే పుట్టాల‌ని కోరుకుంటున్న‌ట్లు తెలిపింది.’ ఆడవాళ్లు మీకు జోహార్లు’ సినిమాలో పెళ్లి చూపుల కారణంగా అమ్మాయిలు ఎలాంటి ఇబ్బందులు ప‌డ‌తారో తెలిసింది. ఇష్టం ఉన్నా లేక‌పోయినా చ‌క్క‌గా అలంక‌రించుకుని అబ్బాయి, వాళ్ల బంధువులు ముందు త‌ల వంచుకుని కూర్చోవాలి. ఆ బాధ‌లు చూశాక వ‌చ్చే జ‌న్మ‌లో అయినా మ‌గ‌వాడిగా పుట్టాల‌ని కోరుకుంటున్నాను. ఎందుకంటే అబ్బాయి చ‌క్క‌గా కాలు మీద కాలు వేసుకుని ప్ర‌శ్న‌లు అడుగుతూ కూర్చోవ‌చ్చు అని అందుకే మగవాడిలా పుట్టాలనీ అనుకుంటున్నానని చెప్పుకొచ్చింది.

- Advertisement -
Advertisement
Advertisement

టాప్ స్టోరీస్

View All
Advertisement

గాసిప్స్

View All