Homeటాప్ స్టోరీస్న్యూ ఇయర్ లో రష్మిక ఫుల్ బిజీ బిజీ

న్యూ ఇయర్ లో రష్మిక ఫుల్ బిజీ బిజీ

న్యూ ఇయర్ లో రష్మిక ఫుల్ బిజీ బిజీ
న్యూ ఇయర్ లో రష్మిక ఫుల్ బిజీ బిజీ

రష్మిక మందన్న ఇప్పుడు టాలీవుడ్ లో బిజీ నటి. కన్నడ నుండి ఛలో సినిమాతో తెలుగు సినిమాకు పరిచయమైన రష్మిక చాలా తక్కువ కాలంలోనే స్టార్ హీరోల దృష్టిలో పడింది. ఒకవైపు యువ హీరోలతో జతకడుతూనే మరోవైపు స్టార్ హీరోల సినిమాల్లో కూడా ఆడిపాడుతోంది. రష్మిక నటిస్తోన్న, నటించనున్న పలు సినిమాలు ఇప్పుడు సెట్స్ పై ఉన్నాయి. ఇప్పటికే మహేష్ బాబు సరసన సరిలేరు నీకెవ్వరు చిత్రంలో నటించింది రష్మిక. సినిమా షూటింగ్ ఇప్పటికే పూర్తయింది. జనవరి 5 నుండి 10 రోజుల పాటు సరిలేరు సినిమా ప్రమోషన్స్ లో బిజీగా మారనుంది. అలాగే నితిన్ సినిమాలో రష్మిక నటిస్తోన్న విషయం తెల్సిందే. భీష్మ సినిమాలో నటిస్తోంది రష్మిక. ఈ సినిమా షూటింగ్ ప్రస్తుతం చివరి దశకు చేరుకుంది. ఫిబ్రవరి 21న ఈ చిత్రాన్ని విడుదల చేయాలని నిర్ణయించారు. ఈ నేపథ్యంలో సరిలేరు నీకెవ్వరు ప్రమోషన్స్ ముగియగానే, భీష్మ ప్రమోషన్స్ ను మొదలుపెట్టాల్సి ఉంది.

భీష్మలో రష్మికకు పెద్ద పాత్రే దక్కినట్లు తెలుస్తోంది. హీరోతో సమానంగా పెర్ఫార్మన్స్ కు స్కోప్ ఉన్న పాత్ర దక్కడంతో రష్మిక ఈ చిత్రాన్ని పర్సనల్ గా తీసుకుంది. ఇదిలా ఉంటే రష్మిక మందన్న అల్లు అర్జున్ – సుకుమార్ ప్రాజెక్ట్ లో కూడా భాగమైన విషయం తెల్సిందే. ఈ సినిమా షూటింగ్ ఇప్పటికే మొదలైంది. అల్లు అర్జున్ లేకపోయినా తొలి షెడ్యూల్ ను పూర్తి చేసుకుని వచ్చాడు సుకుమార్. ఫిబ్రవరి నుండి ఈ సినిమాలో రష్మిక జాయిన్ కానుంది. ఇందులో కూడా రష్మిక పాత్రకు ప్రాధాన్యత ఎక్కువని తెలుస్తోంది. ఈ సినిమా షూటింగ్ కు కాల్ షీట్స్ కూడా ఎక్కువే ఇచ్చింది ఈ భామ. ఇలా వచ్చే వేసవి వరకూ రష్మిక ఫుల్ బిజీ బిజీగా గడపనుంది. దీంతో పాటు పలు ప్రాజెక్టులు చర్చల దశలో ఉన్నాయి. మరో నెలలో వాటిపై ఒక నిర్ణయం తీసుకోవాల్సి ఉంది.

- Advertisement -
Advertisement
Advertisement

టాప్ స్టోరీస్

View All
Advertisement

గాసిప్స్

View All