
ఛలో బ్యూటీ రష్మిక ..తలపతి విజయ్ కి జోడిగా నటించే ఛాన్స్ కొట్టేసింది. ఛలో మూవీ తో తెలుగు లో ఎంట్రీ ఇచ్చిన కన్నడ బ్యూటీ రష్మిక..ఆ తర్వాత గీత గోవిందం తో యూత్ అండ్ ఫ్యామిలీ ఆడియన్స్ ను విపరీతంగా ఆకట్టుకుంది. ఈ రెండు సినిమాల విజయాలతో అమ్మడికి వరుస అవకాశాలు తలుపు తట్టడం..అవన్నీ కూడా పెద్ద విజయాలు సాధించడం తో అతి తక్కువ టైంలోనే రష్మిక టాప్ ప్లేస్ కు చేరుకుంది.
కేవలం సినిమాలే కాదు పలు సంస్థలకు బ్రాండ్ అంబాసిడర్ గా వ్యవహరిస్తూ రెండు చేతుల సంపాదిస్తుంది. ఇక గత ఏడాది పుష్ప మూవీ తో పాన్ లెవల్లో గుర్తింపు తెచ్చుకుంది. ప్రస్తుతం తెలుగు , హిందీ , తమిళ్ సినిమాలతో బిజీ గా ఉంది. ఇదిలా ఉండగా తలపతి 66 పేరుతో విజయ్ తదుపరి చిత్రంలో రష్మిక మందన్న హీరోయిన్ గా నటిస్తుందని అధికారికంగా ప్రకటించింది శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్. ఈ రోజు రష్మిక పుట్టినరోజు సందర్భంగా ఈ విషయాన్ని ప్రకటించారు. వంశీ పైడిపల్లి దర్శకత్వంలో తలపతి 66 తమిళ-తెలుగు భాషల్లో తెరకెక్కుతుంది. దిల్ రాజు నిర్మిస్తున్న ఈ సినిమా షూటింగ్ త్వరలో ప్రారంభం కానుంది. ఈ చిత్రానికి ఎస్ థమన్ సంగీతం అందిస్తున్నట్లు తెలుస్తుంది. ఇక విజయ్ విషయానికి వస్తే..ఈ నెల 13 న బీస్ట్ మూవీ తో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాడు.