
ఛలో మూవీ తో తెలుగు లో ఎంట్రీ ఇచ్చిన కన్నడ బ్యూటీ రష్మిక..ఆ తర్వాత గీత గోవిందం తో యూత్ అండ్ ఫ్యామిలీ ఆడియన్స్ ను విపరీతంగా ఆకట్టుకుంది. ఈ రెండు సినిమాల విజయాలతో అమ్మడికి వరుస అవకాశాలు తలుపు తట్టడం..అవన్నీ కూడా పెద్ద విజయాలు సాధించడం తో అతి తక్కువ టైంలోనే రష్మిక టాప్ ప్లేస్ కు చేరుకుంది.
కేవలం సినిమాలే కాదు పలు సంస్థలకు బ్రాండ్ అంబాసిడర్ గా వ్యవహరిస్తూ రెండు చేతుల సంపాదిస్తుంది. ఇక గత ఏడాది పుష్ప మూవీ తో పాన్ లెవల్లో గుర్తింపు తెచ్చుకుంది. ప్రస్తుతం తెలుగు , హిందీ , తమిళ్ సినిమాలతో బిజీ గా ఉంది. అలాగే జిమ్ లో భారీ ఎత్తున వర్కౌట్స్ చేస్తూ తన శరీరాన్ని అదుపులోకి ఉంచుకుంటుంది. తాజాగా ఆమె వర్కౌట్స్ కు సంబదించిన వీడియో ను సోషల్ మీడియా లో షేర్ చేసి ఫాలోయర్స్ ను ఆశ్చర్యానికి గురి చేసింది. ఈమె వర్కౌట్స్ చూసి వారంతా వామ్మో అంటున్నారు.