HomeUncategorizedఅలాంటి పని మాత్రం చేయొద్దంటున్న రష్మిక

అలాంటి పని మాత్రం చేయొద్దంటున్న రష్మిక

అలాంటి పని మాత్రం చేయొద్దంటున్న రష్మిక
అలాంటి పని మాత్రం చేయొద్దంటున్న రష్మిక

రష్మిక మందన్న ఇప్పుడు సూపర్ ఫామ్ లో ఉంది. టాలీవుడ్, కోలీవుడ్, బాలీవుడ్ అన్న తేడా లేకుండా వరసగా సినిమాలు చేస్తోంది. ప్రస్తుతం రష్మిక మందన్న హిందీలో రెండు సినిమాలు చేస్తోంది. ఈ సినిమాల షూటింగ్స్ కోసం రష్మిక ముంబైలోనే నివాసముంటోంది. కొత్తగా ఒక ఫ్లాట్ కూడా తీసుకుంది.

అయితే ఈ విషయం తెలియక రష్మిక ఫ్యాన్స్ ఇబ్బంది పడ్డారు. తెలంగాణ నుండి కర్ణాటకలోని రష్మిక నివాసముంటున్న కొడగు వరకూ వెళ్లారు. అయితే ఆమె అక్కడ లేకపోవడంతో నిరాశగా వెనుతిరిగారు. ఇదిలా ఉంటె రష్మిక ఈ విషయంపై సోషల్ మీడియాలో స్పందించింది.

- Advertisement -

నాకోసం ఇంత రిస్క్ తీసుకోవద్దు. దయచేసి ఎవరూ ఇలా చేయకండి. నా ఫ్యాన్స్ ఇంటి దాకా వెళ్లారట. మిమ్మల్ని కలవలేనందుకు చాలా బాధగా ఉంది. ఏదో రోజు మిమ్మల్ని కలుస్తాను అని ఆశిస్తున్నాను అని రష్మిక పోస్ట్ చేసింది. ప్రస్తుతం రష్మిక అల్లు అర్జున్ సరసన పుష్ప సినిమా చేస్తోంది. అలాగే శర్వానంద్ తో ఆడవాళ్ళూ మీకు జోహార్లు సినిమాను కూడా చేయాల్సి ఉంది.

- Advertisement -
Advertisement
Advertisement

టాప్ స్టోరీస్

View All
Advertisement

గాసిప్స్

View All