
కరోనా వైరస్ కారణంగా కీలక వ్యవస్థలన్నీ స్థంభించిపోయాయి. లక్షల సంఖ్యలో ఉద్యోగాలు కోల్పోయారు. చాలా మంది భారీ స్థాయిలో జీతాలు తీసుకునే ప్రైవేట్ ఉద్యోగులంతా ప్రస్తుతం హాఫ్ సాలరీస్‌కి పనిచేస్తున్నారు. ఆర్థిక వ్యవస్థ ఛిన్నా భిన్నంగా మారింది. ఈ దశలో సిని ఇండస్ట్రీ కూడా పారితోషికాలు, బడ్జెట్‌ల విషయంలో మార్పులకు శ్రీకారం చుట్టింది. స్టార్ హీరోలు కూడా తమ పారితోషికాలు తగ్గించుకోవాలనే ప్రయత్నాల్లో వున్నారు.
సినిమా రిలీజ్‌లు ఆగిపోవడం, థియేటర్లు మూసివేయడం, షూటింగ్‌లు ఆగిపోవడంతో సినీ ఇండస్ట్రీ చాలా ఇబ్బందుల్ని ఎదుర్కొంటోంది. ఇలాంటి దశలో కన్నడ కస్తూరి రష్మిక మందన్న మాత్రం తను ఏ మాత్రం తగ్గనంటోందట. కొత్త ప్రాజెక్ట్‌కు గ్రీన్ సిగ్నల్ ఇవ్వాలంటే భారీ మొత్తంలో పారితోషికం ఇవ్వాల్సిందే అంటూ రష్మిక డిమాండ్ చేస్తోందట. దీంతో ప్రొడ్యూసర్స్ షాక్‌కు గురవుతున్నట్టు వార్తలు వినిపిస్తున్నాయి.
అంతే కాకుండా క్రేజ్‌లేని హీరోల చిత్రాల్లో నటించాలంటే వారికి నిర్మొహమాటంగా నో అని చెప్పేస్తోందట. రష్మిక మందన్నఇటీవల వరుసగా `భీష్మ`, `సరిలేరు నీకెవ్వరు` వంటి చిత్రాలతో విజయాలని సొంతం చేసుకుంది. దీంతో తన క్రేజ్‌ని బట్టి నిర్మాతల్ని భారీగా డిమాండ్ చేయడం ప్రస్తుతం టాక్ ఆఫ్ ది ఇండస్ట్రీగా మారింది. ప్రస్తుతం రష్మిక మందన్న `పుష్ప` చిత్రంలో నటిస్తున్న విషయం తెలిసిందే.