
ఛలో మూవీ తో తెలుగు లో ఎంట్రీ ఇచ్చిన కన్నడ బ్యూటీ రష్మిక..ఆ తర్వాత గీత గోవిందం తో యూత్ అండ్ ఫ్యామిలీ ఆడియన్స్ ను విపరీతంగా ఆకట్టుకుంది. ఈ రెండు సినిమాల విజయాలతో అమ్మడికి వరుస అవకాశాలు తలుపు తట్టడం..అవన్నీ కూడా పెద్ద విజయాలు సాధించడం తో అతి తక్కువ టైంలోనే రష్మిక టాప్ ప్లేస్ కు చేరుకుంది. కేవలం సినిమాలే కాదు పలు సంస్థలకు బ్రాండ్ అంబాసిడర్ గా వ్యవహరిస్తూ రెండు చేతుల సంపాదిస్తుంది. ఇక గత ఏడాది పుష్ప మూవీ తో పాన్ లెవల్లో గుర్తింపు తెచ్చుకుంది. ప్రస్తుతం తెలుగు , హిందీ , తమిళ్ సినిమాలతో బిజీ గా ఉంది. ఈ తరుణంలో ఈ అమ్మడికి ఐటెం ఆఫర్ వచ్చినట్లు బాలీవుడ్ లో వార్తలు వినిపిస్తున్నాయి.
అర్జున్ రెడ్డి ఫేమ్ సందీప్ రెడ్డి వంగ రణబీర్ కపూర్ హీరోగా ‘యానిమల్’ చిత్రాన్ని తెరకెక్కిస్తున్న సంగతి తెలిసిందే. ఇందులో ఓ ఐటం పాటలో నటించడానికి రష్మిక తో చర్చలు జరుపుతున్నారట. రష్మిక ఛరిష్మా ఆ పాటకు అడ్వాంటేజ్ అవుతుందని సందీప్ భావిస్తున్నాడుట. ఈ నేపథ్యంలో రష్మికని తీసుకునే దిశగా ముందుకు కదులుతున్నట్లు తెలుస్తోంది. అయితే ఈ ఆఫర్ వెనుక రష్మిక పాన్ ఇండియా క్రేజ్ కీలక పాత్ర పోషిస్తుందని చెప్పొచ్చు. ‘పుష్ప’ పాటతో సమంత బాలీవుడ్ లో బాగా ఫేమస్ అయింది. పిట్ట చిన్నదే అయినా కూత గనం అన్న మాదిరిగా వెలిగిపోయింది. ఇప్పుడు అదే మాదిరిగా రష్మిక ప్లాన్ చేస్తుందట.