
అఖిల్ అక్కినేని నటిస్తున్న తాజా చిత్రం `మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్`. బొమ్మరిల్లు భాస్కర్ దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రాన్ని అల్లు అరవింద్ సమర్పణలో బన్నీవాసు నిర్మిస్తున్నారు. ఈ మూవీ చివరి షెడ్యూల్ చిత్రీకరణ జరుపుకుంటోంది. ఇందులో పూజా హెగ్డే హీరోయిన్‌గా నటిస్తున్న విషయం తెలిసిందే. బన్నీతో `అల వైకుంఠపురములో` చిత్రంతో ఇండస్ట్రీ హిట్‌ని సొంతం చేసుకున్న బన్నీ హీరోయిన్‌ని ఈ మూవీ కోసం తీసుకున్న అఖిల్ మరో చిత్రానికి కూడా బన్నీ హీరోయిన్ నే కావాలంటున్నాడట.
సురేందర్‌రెడ్డి అఖిల్ తో చేయబోతున్న యాక్షన్ థ్రిల్లర్ కోసం రష్మికని తీసుకోవాలని మేకర్స్ భావిస్తున్నారట. స్పై థ్రిల్లర్‌గా రూపొందనున్న ఈ మూవీలో అఖిల్‌కి జోడీగా రష్మిక అయితేనే పర్‌ఫెక్ట్‌గా వుంటుందని సురేందర్‌రెడ్డి భావిస్తున్నారట. అంతే కాకుండా భారీ బడ్జెట్‌తో చేయబోతున్న సినిమా కావడంతో దీనికి క్రేజ్‌ని తీసుకురావాలన్న ఐడియాతో క్రేజీ కాంబోని సెట్ చేయాలనుకుంటున్నారట.
రష్మిక మందన్న గీత గోవిందం, డియర్ కామ్రేడ్, సరిలేరు నీకెవ్వరు వంటి చిత్రాలతో రకనేజీ హీరోయిన్‌గా మంచి పాపులారిటీని సొంతం చేసుకుంది. దీంతో ఆ క్రేజ్ కోసమే సురేందర్‌రెడ్డి .. రష్మికని ఈ ప్రాజెక్ట్‌లో భాగం చేయాలనుకుంటున్నారట. కానీ రష్మిక నుంచి ఇంకా ఎలాంటి స్పందన రాలేదని తెలిసింది. ప్రస్తుతం బన్నీతో కలిసి రష్మిక `పుష్ప` చిత్రంలో నటిస్తోంది.