
ఓ పక్క బుల్లితెర మీద యాంకర్ గా కొనసాగుతూ మరోపక్క సిల్వర్ స్క్రీన్ పై సందడి చేస్తున్న వారిలో రష్మి కూడా ఒకరు. ముందు వెండితెర మీద ప్రయత్నాలు చేసిన ఈ అమ్మడు అక్కడ ఫెయిల్ అయ్యి స్మాల్ స్క్రీన్ కు షిర్ట్ అయ్యింది. జబర్దస్త్ వల్ల ఆమె కెరియర్ లో నిలదొక్కుకుంది. దానితో పాటుగా సినిమాలు కూడా చేస్తూ వస్తుంది రష్మి. అయితే ఇన్నాళ్లు ఒకేరకమైన పాత్రలు చేస్తూ వచ్చిన రష్మికి లేటెస్ట్ గా మెగాస్టార్ చిరంజీవి సినిమా ఆఫర్ వచ్చిందని తెలుస్తుంది.
అదికూడా చిరుతో స్టెప్పులు వేసే లక్కీ ఛాన్స్ అందుకుందట రష్మి. చిరంజీవి, మెహెర్ రమేష్ కాంబినేషన్ లో వస్తున్న భోళా శంకర్ సినిమాలో ఒక స్పెషల్ ఐటం సాంగ్ ఉందని టాక్. ఆ సాంగ్ లో చిరుతో రష్మి కాలు కదిపుతుందని చెబుతున్నారు. రష్మి కూడా మెగా ఛాన్స్ వస్తే వదులుకుంటుందా చెప్పండి.
మెగా మూవీలో రష్మి చేస్తుందా లేదా అన్నది అఫీషియల్ గా తెలియాల్సి ఉంది. ఒకవేళ అది నిజమే అయితే మాత్రం రష్మి పంట పండినట్టే అని చెప్పొచ్చు.