Homeటాప్ స్టోరీస్సౌత్ ఇండస్ట్రీ ఫై రాశిఖన్నా సంచలన వ్యాఖ్యలు

సౌత్ ఇండస్ట్రీ ఫై రాశిఖన్నా సంచలన వ్యాఖ్యలు

అలా నేను చెప్ప‌లేదు - రాశీఖ‌న్నా
అలా నేను చెప్ప‌లేదు – రాశీఖ‌న్నా

కొంతమంది హీరోయిన్లు సౌత్ లో ఛాన్సులు రాబట్టుకొని కాస్త పాపులర్ అయ్యి బాలీవుడ్ లో ఛాన్స్ రాగానే ..తనకు ఛాన్స్ ఇచ్చిన ఇండస్ట్రీ పైనే వివాదాస్పద వ్యాఖ్యలు చేస్తుంటారు. ఇప్పటికే పలువురు ఆలా చేసి వార్తల్లో నిలిచారు. తాజాగా రాశిఖన్నా కూడా సౌత్ ఇండస్ట్రీ ఫై పలు వ్యాఖ్యలు చేసి హాట్ టాపిక్ అయ్యింది.

” సౌత్ సినిమాల్లోకి అడుగుపెట్టాకా రొటీన్ ఫార్ములాకు అలవాటు పడ్డాను.. నాకు రొటీన్ గా ఉండడం ఇష్టం ఉండదు.. కమర్షియల్ సినిమాలలో హీరోల పక్కన కొద్దిసేపు కనిపించడం, తర్వాత పక్కకు వెళ్లిపోవడం ఇదే రొటీన్ ఫార్ములాను టాలీవుడ్ క్రియేట్ చేసింది. అందులో నేను కూడా పడిపోయాను. ఇక నుంచి నా కథల ఎంపికలో కొత్తదనం ఉంటుంది.. ప్రతి సినిమాలో ఒక కొత్త నన్ను చూస్తారని చెప్పుకొచ్చింది.

- Advertisement -

అక్కడి తో ఆగకుండా ప్రతిభను బట్టి కాకూండా లుక్స్ ని బట్టి గుర్తింపు ఇస్తారు.. ఇక అభిమానులు అయితే ఒక్కో హీరోయిన్ కి ఒక్కో ట్యాగ్ ఇస్తారు.. అది నాకు అస్సలు నచ్చదు.. కొద్దిగా తెల్లగా ఉంటె వారిని మిల్కీ బ్యూటీ అనేస్తారు.. ఇప్పటికైనా టాలెంట్ ని బట్టి హీరోయిన్లను గుర్తించాలని అభిమానులను కోరుకుంటున్నాను అంటూ చెప్పుకొచ్చింది. ప్రస్తుతం ఈ వ్యాఖ్యలు నెట్టింట వైరల్ గా మారింది.

- Advertisement -
Advertisement
Advertisement

టాప్ స్టోరీస్

View All
Advertisement

గాసిప్స్

View All