
చాలెంజింగ్ రోల్స్ చేయడానికి ఇష్టపడే అరుదైన నటులలో రావు రమేష్ ఒకరు. సినిమా .. సినిమాకు ఆయన నటన పరంగా వైవిద్యాన్ని చూపిస్తూ తనకు తానే సాటి అనిపించుకుంటున్నారు. రావు గోపాలరావు తనయుడుగా ఇండస్ట్రీకి పరిచయమైనా అనతి కాలంలోనే తనదైన మార్కు నటనతో ప్రత్యేక గుర్తింపుని సొంతం చేసుకున్నారాయన.
ప్రస్తుతం ఆయన అజయ్ భూపతి దర్శకత్వం వహిస్తున్న`మహా సముద్రం`లో నటిస్తున్నారు. శర్వానంద్, సిద్ధార్థ్ ప్రధాన హీరోలుగా నటిస్తున్న ఈ మూవీలో జగపతిబాబు ఓ కీలక పాత్రలో నటిస్తుండగా రావు రమేష్ ఛాలెంజింగ్ పాత్రలో కనిపించనున్నారట. ఈ పాత్రని ఆయన సవాలుగా తీసుకుని పోషిస్తున్నారని తెలిసింది.
అజయ్ భూపతి ఈ చిత్రంలోని ప్రతి ఆర్టిస్టును ఇంతకు ముందెన్నడూ చూడని రీతిలో ఆవిష్కరిస్తున్నారు. ఈ చిత్రంలో అనవసరమైన ఒక్క పాత్ర కూడా లేదని చెబుతున్నారు. అదే విధంగా, రావు రమేష్ పాత్ర `మహా సముద్రం`లో కీలక పాత్రలో కనిపిస్తారట. ఈ చిత్రం షూటింగ్ ప్రస్తుతం వైజాగ్‌లో జరుగుతోంది. ప్రధాన తారాగణంపై కీలక సన్నివేశాలను చిత్రీకరిస్తున్నారు.