Homeటాప్ స్టోరీస్ఫేక్ అకౌంట్‌ల‌పై రావు ర‌మేష్ సీరియ‌స్‌!

ఫేక్ అకౌంట్‌ల‌పై రావు ర‌మేష్ సీరియ‌స్‌!

ఫేక్ అకౌంట్‌ల‌పై రావు ర‌మేష్ సీరియ‌స్‌!
ఫేక్ అకౌంట్‌ల‌పై రావు ర‌మేష్ సీరియ‌స్‌!

మ‌డ‌ష‌న్నాక కాసింత క‌ళాపోష‌నుండాలి.. ఆకాశంలో సూరీడు ర‌క్తం క‌క్కుతున్న‌ట్టు లేడూ.. వంటి డైలాగ్‌ల్ని న‌ట విరాట్ రావు గోపాల‌రావు త‌ప్ప మ‌రొక‌రు ప‌ల‌క‌లేరు. ఆ విష‌యంలో త‌న తండ్రిని గుర్తు చేస్తూ విల‌క్ష‌ణ‌మైన న‌ట‌న‌తో ఆక‌ట్టుకుంటున్నారు రావు ర‌మేష్‌. క్యారెక్ట‌ర్ ఆర్టిస్ట్‌గా, హీరో లేదా హీరోయిన్ తండ్రి పాత్ర‌ల్లో న‌టిస్తూ త‌న‌దైన ముద్ర‌ వేసుకున్నారు.

స్మాల్ హీరోల నుంచి స్టార్ హీరోల వ‌ర‌కు మంచి అనుబంధం వున్న రావు ర‌మేష్‌కు సోష‌ల్ మీడియా ఇప్ప‌టి వర‌కు ఎలాంటి అకౌంట్‌లు లేవు. అయితే ఆయ‌న పేరు మీద ఎవ‌రో ఈ మ‌ధ్య ట్వీట్‌లు పెడుతున్నార‌ట‌. ఈ విష‌యాన్ని మీడియాకు వెల్ల‌డించారు. ఏపీ ముఖ్య‌మంత్రి ఏడాది పాల‌పై రావు ర‌మేష్ పేరుతో చేసిన ట్వీట్ వివాదం అయ్యే అవ‌కాశాలు వుండ‌టంతో రావు‌ర‌మేష్ ఆ ఫేక్ అకౌంట్‌పై క్లారిటీ ఇచ్చారు .

- Advertisement -

మీడియా మిత్రుల‌కు, న‌న్ను, నా న‌ట‌న‌ను అభిమానించే ప్ర‌తి ఒక్క‌రికీ నాకు ఏ సోష‌ల్ మీడియాలో ఎటువంటి అకౌంట్‌లు లేవు. ఫేస్ బుక్‌, ట్విట్ట‌ర్‌గానీ, ఇన్ స్టా గ్రామ్ ఇలా ఏ సామాజిక మాధ్య‌మాల్లోనూ త‌న‌కు ఎలాంటి అకౌంట్‌లు లేవని స్ప‌ష్టం చేశారు. ఈ రోజు నా పేరు మీద ట్విట్ట‌ర్‌లో పోస్ట్‌లు పెడుతున్నారు. ఆ పోస్ట్‌ల‌కు గానీ, ఆ అకౌంట్‌కు గానీ నాకు ఎటువంటి సంబంధం లేదు. ద‌య‌చేసి వాటిని న‌మ్మ‌కండి. ఏమైనా వుంటే ప‌త్రికా ముఖంగా నేనే తెలియ‌జేస్తాను. త్వ‌ర‌లోనే నా పేరు మీద ఇలా చేస్తున్న వారి మీద పోలీస్ కంప్లైంట్ పెట్ట‌బోతున్నాను` అన్నారు.

- Advertisement -
Advertisement
Advertisement

టాప్ స్టోరీస్

View All
Advertisement

గాసిప్స్

View All