Homeటాప్ స్టోరీస్రావు రమేష్.. హీరో కాని హీరో

రావు రమేష్.. హీరో కాని హీరో

రావు రమేష్.. హీరో కాని హీరో
రావు రమేష్.. హీరో కాని హీరో

నిన్న ఏకంగా నాలుగు సినిమాలు బాక్స్ ఆఫీస్ పై దాడి చేయడానికి విడుదలయ్యాయి. చాలా కాలంగా సినిమాలు లేక మంచి సినిమాల కోసం ఎదురుచూసిన ప్రేక్షకులు, ఒకేసారి నాలుగు సినిమాలు విడుదలయ్యేసరికి దేనికి వెళ్ళాలో తోచని పరిస్థితి ఎదురైంది. అయితే విడుదలైన నాలుగు చిత్రాలు ప్రతిరోజూ పండగే, రూలర్, దొంగ, దబాంగ్ 3 లలో ప్రతిరోజూ పండగే చిత్రానికి కొంచెం బెటర్ టాక్ వచ్చింది. ఈ సినిమా సూపర్ డూపర్ హిట్ అన్న రేంజ్ లో లేకపోయినా రిలీజైన సినిమాల్లో బెటర్ అన్న టాక్ తో కలెక్షన్స్ కూడా ఈ చిత్రానికే ఎక్కువ వచ్చే అవకాశాలు ఉన్నాయి. జనాల నుండి వచ్చే స్పందన కూడా బాగుంది. దీంతో ఓపెనింగ్స్ విషయంలో వెనుతిరిగి చూడాల్సిన అవసరమే లేదు.

చాలా కాలం తర్వాత సాయి తేజ్ ఎదురుచూస్తున్న బ్లాక్ బస్టర్ వస్తుందా రాదా అన్నది పక్కనపెడితే హిట్ అయ్యే లక్షణాలు అయితే పుష్కలంగా ఉన్నాయి. సో 2019 సాయి ధరమ్ తేజ్ కు కలిసొచ్చినట్లేనన్న మాట. చిత్రలహరితో డీసెంట్ హిట్ అందుకున్న తేజ్, ఈసారి సూపర్ హిట్, పరిస్థితులు అనుకూలిస్తే బ్లాక్ బస్టర్ ఫలితాన్ని అందుకోవడం కూడా తధ్యమే. అయితే ప్రతిరోజూ పండగేలో నిజానికి తేజ్ హీరో అయినా కూడా అతనికన్నా ఎక్కువ హైలైట్ అయిన పాత్రలు రెండు ఉన్నాయి. ఒకటి తేజ్ తాతగా చేసిన సత్యరాజ్ ది కాగా, మరొకటి తేజ్ తండ్రిగా నటించిన రావు రమేష్ ది. ఇద్దరిలో కూడా రావు రమేష్ కే ఎక్కువ మార్కులు పడతాయి. సినిమా అయిపోయాక బయటకు వచ్చిన ప్రేక్షకుడు కూడా తన పాత్ర గురించే ఎక్కువ మాట్లాడతాడు. సినిమా మొత్తం సత్యరాజ్ చుట్టూ తిరుగుతుంది. అయితే రావు రమేష్ తనకే సాధ్యమైన టిపికల్ డైలాగ్ డెలివరీతో, మాట విరుపులతో అదరగొట్టేసాడు. అసలు ప్రతిరోజూ పండగే సినిమాలో రావు రమేష్ పాత్ర పూర్తి స్థాయిలో ప్రవేశించాక కానీ కథనంలో ఊపు రాదు.

- Advertisement -

రావు రమేష్ కామెడీ టైమింగ్, అతని ఫ్రస్ట్రేషన్ కడుపుబ్బా నవ్విస్తాయి. అలాగే క్లైమాక్స్ లో తన నటనతోనూ మెప్పిస్తాడు. ఇలా ఏ రకంగా చూసుకున్నా కూడా రావు రమేష్ ను ప్రతిరోజూ పండగే చిత్రానికి హీరో కాని హీరో అనే సంభోదిస్తున్నారు ప్రేక్షకులు. మరోసారి తనకు సరైన పాత్ర ఇస్తే ఎలా చెలరేగిపోతాడో నిరూపించాడు రావు రమేష్.

- Advertisement -
Advertisement
Advertisement

టాప్ స్టోరీస్

View All
Advertisement

గాసిప్స్

View All