Homeటాప్ స్టోరీస్హీరోలను మించి ఎంటర్టైన్ చేసిన ఆ ఇద్దరూ...

హీరోలను మించి ఎంటర్టైన్ చేసిన ఆ ఇద్దరూ…

హీరోలను మించి ఎంటర్టైన్ చేసిన ఆ ఇద్దరూ...
హీరోలను మించి ఎంటర్టైన్ చేసిన ఆ ఇద్దరూ…

సాధారణంగా ఏది సినిమా చూసి వస్తే సినిమా ఎలా ఉంది అని అడిగిన తర్వాత, బాగుందని తెలిస్తే హీరో పెర్ఫార్మన్స్ గురించి చర్చించుకుంటాం. అయితే ఈ మధ్య విడుదలైన రెండు సినిమాల గురించి మాట్లాడుకునేటప్పుడు మాత్రం హీరో కంటే ముందు ఆ సినిమాలో ప్రధాన పాత్రలు పోషించిన నటుల గురించి చర్చించుకోవడం ప్రాధాన్యత సంతరించుకుంది. ఆ సినిమాలే ప్రతిరోజూ పండగే, మత్తు వదలరా.

ప్రతిరోజూ పండగేలో సాయి ధరమ్ తేజ్ హీరో అయినా కూడా తన పాత్రకు ఎక్కువ ఎంటర్టైన్మెంట్ ఉండదు. బాధ్యతతో కూడిన పాత్ర అది. తన తాతను సంతోషంగా సాగనంపాలని తపన పడే పాత్ర అది. అందుకే దర్శకుడు మారుతి ఎంటర్టైన్మెంట్ మొత్తాన్ని రావు రమేష్ పాత్రకు కట్టబెట్టాడు. ఆ పాత్ర ఫ్రస్ట్రేట్ అవుతుంటే మనం నవ్వుకుండా ఉండలేం. ఒకానొక స్టేజ్ లో అయితే నవ్వి నవ్వి కడుపు నొప్పి కూడా వస్తుంది. ఆ రేంజ్ లో పండింది ఈ పాత్ర. థియేటర్ల నుండి బయటకు వచ్చిన జనాలు ముందు గుర్తుచేసుకునేది రావు రమేష్ పాత్రనే అంటే అతిశయోక్తి కాదు. దర్శకుడు ఇచ్చిన పాత్రను తనదైన శైలి మాట విరుపులు, డైలాగ్ చమక్కులు కలగలిపి భలే రక్తి కట్టించాడు.

- Advertisement -

ఇక మత్తు వదలరా సినెమా ఈ నెల 25న విడుదలైంది. కీరవాణి అబ్బాయి శ్రీ సింహా హీరోగా పరిచయమయ్యాడు. అయితే సినిమా చూసినవాళ్లు శ్రీ సింహా గురించి కన్నా ఇందులో అతని ఫ్రెండ్ గా చేసిన సత్య గురించే ఎక్కువ మాట్లాడుకుంటారు. నిజానికి శ్రీ సింహా ఇందులో డీసెంట్ పాత్ర చేసాడు. బాయ్ నెక్స్ట్ డోర్ వంటి పాత్రలో ఒదిగిపోయాడు. ఎక్కడా కీరవాణి కొడుకులా కనిపించలేదు. అయితే తనని డామినేట్ చేసే రేంజ్ లో కమెడియన్ సత్య పాత్ర ఇందులో ఎంటర్టైన్ చేస్తుంది. దాదాపు సత్య ఉన్న సీన్లన్నీ మనం నవ్వుతూనే ఉంటామంటే పరిస్థితి అర్ధం చేసుకోవచ్చు. సినిమాను ప్రచారం చేసేటప్పుడు కూడా సత్య కిది రీ ఇంట్రడక్షన్ లాంటిది చిత్ర యూనిట్ ప్రచారం చేసారంటే అర్ధం చేసుకోవచ్చు అతని పాత్రకు ఎంత ఇంపార్టెన్స్ ఉందో.

ఇలా రావు రమేష్, సత్య ఇద్దరూ తమ తమ సినిమాలకు వెన్నుముకగా నిలిచారు.

- Advertisement -
Advertisement
Advertisement

టాప్ స్టోరీస్

View All
Advertisement

గాసిప్స్

View All