Homeటాప్ స్టోరీస్వెండితెర క‌పిల్‌తో హ‌రియాణా హ‌రికేన్‌!

వెండితెర క‌పిల్‌తో హ‌రియాణా హ‌రికేన్‌!

Ranveer Singh wishes to Kapil Dev
Ranveer Singh wishes to Kapil Dev

హ‌రియాణా హ‌రికేన్‌గా పేరు తెచ్చుకున్న ఇండ‌య‌న్ మాజీ కెప్టెన్ క‌పిల్‌దేవ్. 1983లో భార‌త్‌కు వ‌ర‌ల్డ్ క‌ప్ ని అందించి యావ‌త్ భార‌తీయులు గ‌ర్వ‌ప‌డేలా చేశారు. అనామ‌క జ‌ట్టుగా 83 వ‌ర‌ల్డ్ క‌ప్‌లోకి ఎంట‌రైన ఇండియ‌న్ ఆట‌గాళ్ల‌ని క‌పిల్ డెవిల్స్‌గా మార్చి భార‌తీయుల చిర‌కాల స్వాప్నాన్ని సాకారం చేయ‌డంలో ప్ర‌ధాన భూయిక‌ని పోషించి భార‌త్‌ను విశ్వ‌విజేత‌గా ప్ర‌పంచం ముందు స‌గ‌ర్వంగా నిల‌బెట్టారు. ఆ స‌మ‌రాన్ని వెండితెర‌పై మ‌న‌ క‌ళ్ల‌కు క‌ట్టబోతోంది `83`.

`83` పేరుతో బాలీవుడ్‌లో ఓ చిత్రం రూపొందుతున్న విష‌యం తెలిసిందే. క‌పిల్‌దేవ్ పాత్ర‌లో బాలీవుడ్ రాక్‌స్టార్ ర‌ణ్‌వీర్‌సింగ్ న‌టిస్తున్నారు. క‌బీర్‌ఖాన్ దర్శ‌క‌త్వం వ‌హిస్తున్నారు. 1983 ప్ర‌పంచ క‌ప్ ఫైన‌ల్ మ్యాచ్‌ ఉత్కంఠ‌భ‌రితంగా సాగింది. ఈ మ్యాచ్‌ని మ‌రోసారి ప్రేక్ష‌కుల ముందుకు స‌జీవంగా తీసుకురాబోతున్నారు `83` టీమ్‌. అత్యంత భారీ స్థాయిలో నిర్మిస్తున్న ఈ చిత్రం ఏప్రిల్ 10న విడుద‌ల కానుంది. అయితే జ‌న‌వ‌రి 6న క‌పీల్‌దేవ్ పుట్టిన రోజును పుర‌స్క‌రించుకుని చిత్ర క‌థానాయ‌కుడు ర‌ణ్‌వీర్‌సింగ్ `83` సెట్‌లో ప్ర‌త్యేకంగా పుట్టిన రోజు శుభాకాంక్ష‌లు అంద‌జేశారు.

- Advertisement -

క‌పిల్‌తో దిగిన ఫొటోల‌ని ఇన్‌స్టా ద్వారా అభిమానుల‌తో పంచుకున్నారు. అవి సోష‌ల్ మీడియాలో వైర‌ల్‌గా మారాయి. ఈ సంద‌ర్భంగా సెట్‌లో సంద‌డి చేసిన క‌పిల్ త‌న ఫేవ‌రేట్ న‌ట‌రాజ్ షాట్‌ని మ‌రోసారి ప్ర‌ద‌ర్శించి టీమ్ అంద‌రిని ఆశ్చ‌ర్యంలో ముంచెత్తారు. వెండితెర క‌పిల్‌తో హ‌రియాణా హ‌రికేన్ సంద‌డి చేయ‌డం ప‌లువురిని ఆక‌ట్టుకుంటోంది.

- Advertisement -
Advertisement
Advertisement

టాప్ స్టోరీస్

View All
Advertisement

గాసిప్స్

View All