Homeటాప్ స్టోరీస్చ‌ర‌ణ్ నాకు త‌మ్ముడులాంటోడు!! - ప‌వ‌న్ క‌ల్యాణ్‌

చ‌ర‌ణ్ నాకు త‌మ్ముడులాంటోడు!! – ప‌వ‌న్ క‌ల్యాణ్‌

Rangasthalam Vijayothsavam Eventమెగాప‌వ‌ర్ స్టార్ రామ్‌చరణ్‌, సమంత జంటగా నటించిన చిత్రం ‘రంగస్థలం’. సుకుమార్‌ దర్శకత్వంలో మైత్రీ మూవీ మేకర్స్‌ బ్యానర్‌పై నవీన్‌ ఎర్నేని, యలమంచిలి రవిశంకర్‌, సివిఎం(మోహన్‌) ఈ చిత్రాన్ని నిర్మించారు. మార్చి 30న సినిమా విడుదలైంది. ప్ర‌పంచ వ్యాప్తంగా 100 కోట్ల రూపాయ‌ల షేర్‌క‌లెక్ష‌న్స్‌ను రాబ‌ట్టుకున్న ఈ చిత్రం విజ‌యోత్స‌వ స‌భ శుక్ర‌వారం హైద‌రాబాద్‌లో జ‌రిగింది. ఈ కార్య‌క్ర‌మానికి జ‌న‌సేన అధినేత‌.. ప‌వ‌ర్‌స్టార్ ప‌వ‌న్‌క‌ల్యాణ్ ముఖ్య అతిథిగా విచ్చేశారు. వేడుక‌లో భాగంగా పాట‌ల ప్ర‌ద‌ర్శ‌న జ‌రిగింది. జిగేల్ రాణి.. పాట‌కు మెగాప‌వ‌ర్ స్టార్ రామ్‌చ‌ర‌ణ్ స‌హా యూనిట్ స‌భ్యులంద‌రూ స్టేజ్‌పై డాన్స్ వేయ‌డం కొస‌మెరుపు. విజ‌యోత్స‌వ స‌భ‌లో …

పవర్‌స్టార్‌ పవన్‌కల్యాణ్‌ మాట్లాడుతూ – ”ఓ ఊరి నిండా నింవిపోయిన ‘రంగస్థలం’ నటీనటులందరినీ ఓ చిన్న ఫ్రేమ్‌లో బంధించడం చాలా కష్టం. ఎంతో అనుభవమున్న నటీనటులు, సాంకేతిక నిపుణులు ఈ సినిమాకు పనిచేశారు. ఇక్కడ వినపడుతున్న శబ్దాలు `రంగస్థలం` విజయోత్సపు ధ్వనులు. అవి ఆగ కూడదని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. మరిన్ని రికార్డులను బద్ధలు కొట్టాలి. మరింత విజయాన్ని సాధించాలి. ఉత్తేజం కలిగించే రికార్డులుగా ఇవి ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. కేవలం కలెక్షన్స్‌ పరంగానే కాదు.. అత్యద్భుతమైన సినిమా అని.. తెలుగు ప్రేక్షకులకు, భారతీయ చలన చిత్రసీమలోనే గర్వించదగ్గ సినిమా తీసిన దర్శకుడు సుకుమార్‌గారికి మనస్ఫూర్తిగా అభినందనలు. ఇలాంటి సినిమాకు అండదండలుగా నిలబడ్డ మైత్రీ మూవీస్ సంస్థ నవీన్‌గారు, రవిశంకర్‌గారు, మోహన్‌గారికి నా అభినంద‌న‌లు. నేను సినిమాల్లో సినిమాల్లో యాక్ట్‌ చేయడమే కానీ.. నా సినిమాల‌ను కూడా పూర్తిగా చూడ‌ను. అప్పుడెప్పుడో ‘తొలిప్రేమ’ సినిమా చూడటానికి సంధ్య థియేటర్‌కి వెళ్లాను. ఇబ్బందిగా ఉండటంతో సగం సినిమా చూసి వచ్చేశాను.

- Advertisement -

చాలా సంవత్సరాలు తర్వాత ఓ సినిమాను పబ్లిక్‌ థియేటర్‌లో చూడాలనే కోరిక కలిగింది. దానికి కారణం. రామ్‌చరణ్‌. తన పెర్ఫామెన్స్‌ బావుందని అందరూ మాట్లాడటమే కాదు.. వరల్డ్‌వైడ్‌ రేటింగ్స్‌ కూడా హాలీవుడ్‌ మూవీస్‌ను దాటిన రేటింగ్‌ రావడం చూసి ఆనందపడ్డాను., ఐఎండిబి వాళ్లు ఈ సినిమాకు మోర్‌ దేన్‌ గాడ్‌పాదర్‌, ప్రాన్సెస్‌పొర్టొకో, శశాంక్‌ రిడెమన్షన్‌ కంటే ఎక్కువ రేటింగ్‌ ఇచ్చారు. అలాంటి అద్భుతమైన సినిమా అని తెలిసి సినిమాలో ఏముంటుందో చూడాలని మనసులో కోరిక కలిగింది. సినిమా చూశాను. సినిమా చూస్తున్నప్పుడు రంగస్థలం అనే వూర్లోకి వెళ్లి అక్కడి ప్రజల మధ్య జరిగిన సన్నివేశాలను ప్రేక్షకుడిలా చూసి వచ్చేశాను. అది సినిమాలాగా అనిపించలేదు. జీవితంలా అనిపించింది. రికార్డులు బద్ధలు కొట్టడమే కాదు.. ఇలాంటి సినిమా రావడంతో.. విలువలతో పాటు వాస్తవికతకు దగ్గరగా ఉన్న సినిమా తీయడం.. అది కూడా కమర్షియల్‌గా పెద్ద హిట్‌ కావడం చాలా మందికి ఇన్‌స్పిరేషన్‌ ఇస్తుంది. సుకుమార్‌తో సినిమా చేసే అవకాశం రాలేదు కానీ..

నాకు చాలా ఇష్టమైన దర్శకుడు. సహజత్వానికి దగ్గరగా ఉండే దర్శకుడు. యువతకు ఏం కావాలో తెలిసిన దర్శకుడు, గొప్ప రచయిత. అన్నయ్యని, చరణ్‌ని కలవడానికి ఒకట్రెండుసార్లు వెళితే చరణ్‌ గడ్డం పెంచుకుని, ఒక పంచె కట్టుకుని మురికి మురికిగా వచ్చేవాడు. నేను చూసి ఇలా యాక్ట్‌ చేస్తున్నాడేంటి అనుకునేవాడిని. నాకు పంచె కట్టుకుని యాక్ట్‌ చేసేంత ధైర్యం లేదు. చరణ్‌ చెన్నైలో, హైదరాబాద్‌లో పెరిగాడు. పల్లె గురించి తనకు తెలియదు. కానీ నాకు తెలిసిన చరణ్‌ నేలకు చాలా దగ్గరగా ఉండేవాడు. ఎంత ఎత్తు ఎదిగినా.. అణిగిమణిగి ఉండేవాడు. నేను చిన్నప్పట్నుంచి చరణ్‌ని చూస్తున్నాను. నాకు తెలిసి.. ఈ పాత్ర అతని సహజత్వానికి దగ్గరైన పాత్ర. తను అమేజింగ్‌ పెర్ఫామర్‌. రావమ్‌చరణ్‌కి నేను ఓ పెద్దన్నయ్యలాంటోడ్ని. చ‌ర‌ణ్‌, సుస్మిత అందరికీ నేను బాబాయ్‌ని అనడం కంటే అన్నయ్యలా ఫీలవుతా. చ‌ర‌ణ్ చిన్ప‌ప్పుడు నేేను ముసుగు తన్ని పడుకొంటే వీడు ఆరు గంటలు వెళ్లిపోయి హార్స్‌ రైడింగ్‌ నేర్చుకునేవాడు. ఏదో నేర్చుకోవాలనే తపన చిన్నప్పట్నుంచే వాడిలో ఉండేది. చరణ్‌ ఆర్టిస్టిక్‌ మెటీరియల్‌. సంపూర్ణమైన నటుడు. తన పెర్ఫామెన్స్‌ చూసి ఆనందించాను. చరణ్‌ ఆ పాత్రలో ఒదిగిపోయి నటించాడు. సినిమా చూడగానే గట్టిగా కౌగిలించుకుని ముద్దు పెట్టుకుని అద్భుతంగా పెర్ఫామ్‌ చేశావని అన్నాను. అద్భుతమైన సినిమాలు చరణ్‌ కెరీర్‌లోఉండాలని కోరుకుంటున్నాను.

చరణ్‌ స్థాయి భారతదేశంలోనే కాదు సబ్‌కాంటినెంటల్‌కూడా రీచ్‌ అవుతుందని నమ్మే వ్యక్తిని నేను. తనలో అంతా సత్తా ఉన్న నటుడు. రామ్‌చరణ్‌ సంపూర్ణమైన నటుడు. తనకు సుకుమార్‌గారు అండగా నిలబడ్డారు. ఏదో కొత్త ప్రయత్నం చేస్తుంటే ఈ ప్రయత్నం సక్సెస్‌ కావాలని నేను కూడా కోరుకున్నాను. సుకుమార్‌ కథను రాసుకున్న తీరు.. తెరకెక్కించిన తీరు సహజ సిద్ధంగా ఉన్నాయి. అలాగే అనసూయ కూడా రంగమ్మత్త పాత్రలో ఒదిగిపోయింది. మద్రాస్‌లో ఉన్నప్పుడు అన్నయ్యగారి వద్దకు జగపతిబాబుగారు వచ్చి యాక్టర్‌ కావాలనుకుంటున్నానని కలిశారు. ఆయన అప్పటి నుండే నాకు తెలుసు. ఆయన నేను గొప్ప క్యారెక్టర్‌ ఆర్టిస్ట్‌ కావాలనుకున్నప్పుడు ఎన్నో గొప్ప పాత్రలు వచ్చాయి. అందుకు మచ్చు తునకే ఈ సినిమాలో ప్రెసిడెంట్‌గారి పాత్ర. ఆది పినిశెట్టి కూడా నాకు మద్రాసు నుండి తెలుసు. ఈ సినిమాలో చాలా మంచి పాత్ర చేశారు. అలాగే సమంతగారు అద్భుతంగా పెర్ఫామ్‌ చేశారు. జబర్‌దస్త్‌ నటీనటుల కాంట్రిబ్యూషన్‌ బావుంది. రత్నవేలుగారి సినిమాటోగ్రఫీ అంటే నాకు చాలా ఇష్టం. అలాంటి కెమెరామెన్‌ ఉంటే బావుండేదనిపిస్తుంటుంది. దేవిశ్రీ ప్రసాద్‌గారి సంగీతం, చంద్రబోస్‌గారి సాహిత్యం బావున్నాయి. సినిమాను ఇంత బాగా చేయడానికి కారణం దర్శకుడికి ఉండే విజన్‌. అందుకు కాస్ట్యూమ్‌ డిజైనర్‌.. ఆర్ట్‌ డిపార్ట్‌మెంట్‌ ఎంతో సపోర్ట్‌ చేస్తారు.

ఈ సినిమాలో ఆర్ట్‌ డైరెక్షన్‌ను చూసి ఆనందంపడ్డాను. అలాంటి ఆర్ట్‌ డైరెక్టర్‌ను పరిచయం చేసిన సుకుమార్‌గారికి థాంక్స్‌. ఆర్ట్‌ డైరెక్షన్‌ చేసిన రామకృష్ణగారికి, ఆయన సతీమణి మోనికగారికి అభినందనలు. ఈ సినిమా ఆస్కార్‌కి వెళ్లాల్సిన సినిమా ఇది. దక్షిణ భారతం, ఉత్తర భారతం కలిసి ఓ లాబీగా ఏర్పడి ఇలాంటి గొప్ప సినిమాను లాస్‌ ఏంజిల్స్‌ను షార్ట్‌ లిస్ట్‌ చేయకపోతే ద్రోహం చేసినవాళ్లవుతాం. ఇలాంటి సినిమాను మనం అంతర్జాతీయ స్థాయిలో మనం ప్రమోట్‌ చేస్తే.. దాని ప్రతిఫలం మన దేశ ఖ్యాతి అంతర్జాతీయం మారు మోగుతుంది. దంగల్‌ సినిమా కూడా నాకు బాగా నచ్చింది. ఎందుకంటే అది మన మట్టి కథ.. మన జీవితాల కథ. అలాగే రంగస్థలం మన నేల కథ.. మన తెలుగు నేల కథ. మన మట్టి కథ. అనేక యాక్షన్‌ సినిమాలు చూస్తాం. రొమాంటిక్‌ సినిమాలు చూస్తాం. కానీ.. మన నేల కథ.. మన పౌరుషాలు.. మన పట్టింపులు.. మన గొడవలు. . మన పంతాలు.. వీటిని ఇంత సహజంగా తీసిన సుకుమార్‌గారికి, చరణ్‌కి, నిర్మాతలకు అభినందనలు. ఇది ఇండియా తరపునుండి ఆస్కార్‌కు వెళ్లాల్సిన సినిమా అని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. వారికి నా తరపున ఎలాంటి అండదండలు కావాలన్నా ఇవ్వడానికి రెడీ. అట్టహాసాల కంటే మనదైన వాస్తవికతతో కూడిన సినిమా తీయడం చాలా కష్టం. కథలు రాసి ఫెయిల్‌ అయినవాడ్ని. ఆ కష్టమేంటో నాకు తెలుసు. ఓ కథను రాసి.. దాన్ని ప్రేక్షకుల చేత ఒప్పించి దాన్ని ముందుకు తీసుకెళ్లిన సుకుమార్‌.. ఇలాంటి గొప్ప కథను తెలుగు జాతికి ఇచ్చినందుకు ఆయనకు తెలుగు జాతి రుణపడి ఉంటుది. ఓ మాథమేటిక్‌ లెక్చరర్‌లో ఇంత విషయం దాగుందనే సంగతి మనకు తెలియదు.

రేపు ఎంతో మంది ఇయన్ను చూసి ఇన్‌స్పైర్‌ అవుతారు. నేను సుకుమార్‌గారిని చూసి ఇలా నేర్చుకున్నానని ఎంతో మంది కొత్తవాళ్లు వస్తారు. ఇలాంటి సినిమాను ప్రమోట్‌ చేయడం మన బాధ్యత అని తెలియజేస్తున్నాను. ఏడాది క్రితం బాహుబలి సినిమాకు మన చిత్రసీమ ఎంత అండగా నిలబడిందో.. `రంగస్థలం` చిత్రానికి అలాగే అండగా నిలబడాలి. వర్గాలకు, భావావేశాలకు అతీతంగా అందరూ ‘రంగస్థలం’ సినిమాకు అండగా ముక్త కంఠంతో నిలబడాలి. రాజకీయాల పరంగా ఎవరు ఎన్ని వర్గాలుగా ఉన్నా కూడా తెలుగు సినిమా పరంగా చిత్ర సీమ ఎప్పుడూ ఒకటే. మా అన్నయ్య నాకు తండ్రి. మా వదిన నాకు తల్లి.. చరణ్‌ నాకు తమ్ముడు. వీడు గొప్ప విజయాలు సాధించాలి. చరణ్‌ ఎన్ని జయాలు వచ్చినా, అపజయాలు వచ్చినా కుంగిపోలేదు. పెద్దగా పట్టించుకోకుండా తన పని చేసుకుంటూ వెళ్లిపోతాడు. తనలాంటి వ్యక్తికి ఇలాంటి విజయాలు ఎన్నో వస్తాయి. ఇది ఆరంభం మాత్రమే” అన్నారు.

మెగాపవర్‌స్టార్‌ రామ్‌చరణ్‌ మాట్లాడుతూ – ”సుకుమార్‌ నా ఫేవరెట్‌ డైరెక్టర్‌. ఇంత మంచి క్యారెక్టర్‌ నాకే కాదు.. అభిమానులకు కానీ.. ప్రేక్షకులకు, సినిమా అభిమానులకు.. ఇండస్ట్రీకి ఓ మంచి సినిమా ఇచ్చినందుకు సుకుమార్‌గారికి నా ధన్యవాదాలు. సమంత, ఆది, అనసూయయ, బ్రహ్మాజీ, జగపతిబాబు, మహేశ్‌, ప్రకాశ్‌రాజ్‌ సహా సాంకేతిక నిపుణులకు థాంక్స్‌. సినిమా చూసిన తర్వాత అమ్మ నాన్నలు ఇచ్చిన రియాక్షన్‌ను మరచిపోలేను. అమ్మకైతే మాటలు రాలేదు. కళ్లలో నీళ్లు పెట్టుకుని నా చేయి పట్టుకుని రెండు నిమిషాల పాటు కూర్చో పెట్టుకుంది. తర్వాత కల్యాణ్‌ బాబాయ్‌ ఇంటికెళ్లి సినిమా చూడమని చెబుదామని అనుకుంటున్నాను. అప్పుడే బాబాయ్‌ ఫోన్‌ చేసి ఇంటికి రారా! అన్నారు. ఆయనింకా సినిమా చూడలేదు. కానీ కంగ్రాట్స్‌ చెప్పారు. నువ్వెప్పుడు చూస్తావ్‌ బాబాయ్‌.. చెబితే ఇంట్లోనే షో వేయిస్తాను అని చెప్పాను. ఇంట్లో వద్దు ఇంకేక్కడైనా చూడాలని ఉంది.. జనాలతో కూడా చూడాలని ఉందని అన్నారు. ఆయన తొలిప్రేమ తర్వాత రంగస్థలం సినిమా చూడటానికి థియేటర్‌కు వచ్చినందుకు ఆనంద పడుతున్నాను. ఈ రెండు రియాక్షన్స్‌ మరచిపోలేను. ఇంత మంచి సినిమాను ఇచ్చిన సుకుమార్‌గారికి, నిర్మాతలకు థాంక్స్‌” అన్నారు.

డైరెక్టర్‌ సుకుమార్‌ మాట్లాడుతూ – ”సినిమా సక్సెస్‌ అయినా, కాకపోయినా ప్రతి సినిమాలో ఒక సైన్యం ఉంటుంది. అదే డైరెక్షన్‌ టీమ్‌. ఆర్య దగ్గర నుండి టెక్నికల్‌గా నాకు సపోర్ట్‌ అందించింది రమేశ్‌గారు. అలాగే ప్రసాద్‌ అన్నయ్యతో కూడా ఆర్య దగ్గర నుండి నా వద్దే ఉంటున్నారు. శ్రీమాన్‌ను చూసి నా వ్యక్తిత్వాన్ని సరి చేసుకుంటూ ఉంటాను. అలాగే ఈ కథ బాగా రావడానికి కాశీ, ప్రతాప్‌లే కారణం. కుమారి 21 ఎఫ్‌ తర్వాత మంచి అవకాశాలు వచ్చినా వెళ్లకుండా రంగస్థలంపై వర్క్‌ చేశాడు. తన కెరీర్‌ను పక్కన పడేశాడు. తనకు స్పెషల్‌ థాంక్స్‌. నా శిష్యుడు బుచ్చి నన్ను క్యారెక్టరైజేషన్స్‌పై కథను రాయమని ఎంరేజ్‌ చేశాడు. అలాగే శీను సినిమాలో ఎక్కడో ఒకచోట ఈస్తటిక్‌ సెన్స్‌ యాడ్‌ చేస్తూ వచ్చాడు.ఇది మా టీమ్‌ సక్సెస్‌. సినిమాలో నార్మల్‌ ఉన్న సీన్స్‌ను నేను రాసినవనుకుంటే.. ప్రేక్షకులు క్లాప్స్‌ కొట్టిన సీన్స్‌ నా టీమ్‌ రాసిందే. శ్రీకాంత్‌, ప్రసాద్‌, సింహా, పవన్‌, వీరు ఇలా టాలెంట్‌ వ్యక్తుల కారణంగానే మంచి అవుట్‌పుట్‌ రాబట్టుకోగలిగాను. వీరందరికీ థాంక్స్‌” అన్నారు.

సమంత మాట్లాడుతూ – ”మా టీం పడ్డ కష్టం నాకు తెలుసు. ఇంత మంచి సంతోషాన్ని నాకు ఇచ్చిన ప్రేక్షకులకు థాంక్స్‌. మేం అనుకున్న దానికంటే ప్రేక్షకులు పెద్ద బహుమతినిచ్చారు. రామలక్ష్మి క్యారెక్టర్‌ నాకు ఎప్పటికీ గుర్తుండిపోతుంది. చిట్టిబాబు క్యారెక్టర్‌ లేకపోతే రామలక్ష్మి క్యారెక్టర్‌ లేదు. నాకు ఇన్‌స్పిరేషన్‌ ఇచ్చాడు. మైత్రీ మూవీమేకర్స్‌కి థాంక్స్‌” అన్నారు.

జగపతిబాబు మాట్లాడుతూ – ”రంగస్థలం విడుదలైన తర్వాత బయ్యర్స్‌ను సినిమా కలెక్షన్స్‌ ఎలా ఉన్నాయని అడిగితే.. ‘వరదలా పారుతుంది. ఎలా వస్తుందో ఎక్కడ అగుతుందో తెలియడం లేదు’ అని చెప్పారు. సినిమా అంత పెద్ద సక్సెస్‌ సాధించినందుకు ఆనందంగా ఉంది. రంగస్థలంలో ఒకరిద్దరు కాకుండా పదిహేను, పదహారు మంది ఆర్టిస్టులు అద్భుతంగా చేశారు. క్రెడిట్‌ అంతా సుకుమార్‌కే దక్కుతుంది. నా ముప్పై ఏళ్ల చరిత్రలో ఇది బెస్ట్‌ క్యారెక్టర్‌ అవుతుంది. త్వరలోనే ఓ పెద్ద హీరోతో బాలీవుడ్‌ మూవీ చేయబోతున్నాను. ఆ వివరాలను త్వరలోనే చెబుతాను. మైత్రీ మూవీ నిర్మాతలు బావుండాలని యూనిట్‌లో ప్రతి ఒక్కరూ కోరుకున్నారంటే వారి మనసు ఎంత మంచిదో అర్థం చేసుకోవచ్చు. చిట్టిబాబు క్యారెక్టర్‌ను రామ్‌చరణ్‌ చించేశాడంతే! చెర్రీ క్యారెక్టర్‌ను ఓన్‌ చేసుకుని చేశాడు. దేవిశ్రీ అద్భుతమైన సంగీతాన్ని అందించాడు. రత్నవేలు క్విక్‌గానే కాదు.. ఎక్స్‌ట్రార్డినరీగా చేయగలడు. అలాగే చంద్రబోస్‌గారు ఎక్స్‌ట్రార్డినరీ లిరిక్స్‌ ఇచ్చాడు. ఆర్ట్‌ డైరెక్టర్‌ రామకృష్ణకి థాంక్స్‌” అన్నారు.

అజయ్‌ ఘోష్‌ మాట్లాడుతూ – ”ఇంత మంచి సక్సెస్‌కు కారణం ప్రేక్షక దేవుళ్లు అయితే మైత్రీ మూవీ మేకర్స్‌ నిర్మాతలు ఇలాంటి కథను నమ్మి సినిమా చేశారు. మన మూలాలు వెతుక్కునేలా సినిమా సినిమాను నిర్మించిన దార్శినికుడు సుకుమార్‌గారు. ఈసినిమాలో చిన్న చిన్న క్యారెక్టర్‌లో చేయడం నా అదృష్టం. అద్భుతమైన ఆర్టిస్టులు, టెక్నీషియన్స్‌తో పనిచేశాను. చరణ్‌ తండ్రిని చిరంజీవి.. అని చెప్పుకునే నటుడు రామ్‌చరణ్‌గారు. మంచి సినిమాలో అవకాశం ఇచ్చిన దర్శక నిర్మాతలకు థాంక్స్‌” అన్నారు.

చంద్రబోస్‌ మాట్లాడుతూ – ”ఇంతటి ఘన విజయం దక్కినందుకు సంతోషంగా, సంతృప్తిగా ఉంది. నేను రాసిన పాటలకు ఎంతో మంచి పేరు వచ్చింది. నన్ను మరోస్థాయికి తీసుకెళ్ళిన పాటలివి. రామ్‌చరణ్‌కి..సుకుమార్‌..నిర్మాతలకు థాంక్స్‌” అన్నారు.

ఈ కార్యక్రమంలో ఆది పినిశెట్టి, దేవిశ్రీ ప్రసాద్‌, అనసూయ, రామకృష్ణ, మోనిక, రత్నవేలు తదితరులు పాల్గొని సినిమా సక్సెస్‌ పట్ల తమ సంతోషాన్ని వ్యక్తం చేశారు.

 

- Advertisement -
Advertisement
Advertisement

టాప్ స్టోరీస్

View All
Advertisement

గాసిప్స్

View All