ఫుల్లుగా మద్యం తాగి డ్రైవింగ్ చేస్తూ పోలీసులకు అడ్డంగా దొరికిపోయాడు రంగస్థలం సింగర్ రాహుల్ . ఈ గాయకుడి తో పాటుగా యాంకర్ , నటుడు లోభో కూడా ఉండటం గమనార్హం . మాదాపూర్ లో మందు పార్టీ చేసుకున్న రాహుల్ , లోభో లు కారులో వేగంగా వస్తూ పోలీసులకు దొరికారు . అయితే పోలీసులకు సహకరించకుండా కొంతసేపు వాగ్వాదానికి దిగాడు రాహుల్ ఆ తర్వాత పోలీసులు జులుం ప్రదర్శించడంతో సహకరించకతప్పలేదు .
రంగస్థలం చిత్రంలో టైటిల్ సాంగ్ పాడాడు ఈ రాహుల్ . రంగస్థలం చిత్రంలోనే కాకుండా పలు చిత్రాల్లో పాటలు పాడాడు రాహుల్ అలాగే పలు ఆల్బమ్ లు కూడా చేసి పాపులర్ అయ్యాడు . మోతాదుకు మించి తాగడమే కాకుండా డ్రైవింగ్ లైసెన్స్ కూడా లేదు రాహుల్ కు దాంతో పోలీసులు సీరియస్ గా పరిణగిస్తున్నారు . నటుడు , యాంకర్ లోభో కూడా పోలీసులకు పట్టుబడ్డాడు , కొద్దిరోజుల క్రితమే వరంగల్ నుండి హైదరాబాద్ వస్తూ కారు యాక్సిడెంట్ చేసాడు లోభో , అయితే ఆ సంఘటన జరిగి ఎన్నో రోజులు కాలేదు మళ్ళీ తప్ప తాగి మళ్ళీ దొరకడం విచిత్రమే !
English Title: Rangasthalam Singer Rahul Sipligunj caught in drunk and drive