Homeటాప్ స్టోరీస్జులై 7న రంగస్థలం శతదినోత్సవం వేడుకలు

జులై 7న రంగస్థలం శతదినోత్సవం వేడుకలు

rangasthalam 100 days function on july 7th మెగాపవర్ స్టార్ రాంచరణ్ తేజ్ నటించిన రంగస్థలం చిత్రం ఈనెల 7న వంద రోజులను పూర్తి చేసుకుంటుండటంతో ఆరోజున శతదినోత్సవ వేడుకలను జరపడానికి సన్నాహాలు చేస్తున్నారు మెగా అభిమానులు . మార్చి 30 న భారీ ఎత్తున ప్రపంచ వ్యాప్తంగా విడుదలైన రంగస్థలం చిత్రానికి ప్రేక్షకులు బ్రహ్మరథం పట్టారు దాంతో నాన్ బాహుబలి రికార్డులన్నీ బద్దలయ్యాయి . బాహుబలి చిత్రాల తర్వాత స్థానాన్ని ఆక్రమించింది రంగస్థలం చిత్రం .

సుకుమార్ దర్శకత్వంలో మైత్రి మూవీ మేకర్స్ నిర్మించిన ఈ చిత్రానికి దేవిశ్రీ ప్రసాద్ అందించిన సంగీతం కూడా హైలెట్ గా నిలిచింది . ఇక చరణ్ – సమంత ల కెరీర్ లో మైలురాయిగా నిలిచింది రంగస్థలం చిత్రం . చెవిటివాడి గా చరణ్ నటన నభూతో నభవిష్యత్ అన్న రీతిలో సాగింది అలాగే సమంత నటన కూడా ఈ చిత్రానికి మరో హైలెట్ . 1980 నాటి కథతో తెరకెక్కిన ఈ చిత్రంతో సుకుమార్ కూడా చెరిగిపోని విజయాన్ని అందుకున్నాడు .

- Advertisement -

రికార్డుల మోత మోగించి శతదినోత్సవం ని కంప్లీట్ చేసుకుంటున్న సందర్బంగా రెండు తెలుగు రాష్ట్రాలలో రంగస్థలం చిత్రాన్ని ప్రదర్శిస్తున్న థియేటర్ లలో శతదినోత్సవ వేడుకలను నిర్వహించడానికి ఏర్పాట్లు చేస్తున్నారు మెగా అభిమానులు . హైదరాబాద్ లోని మెయిన్ థియేటర్ సుదర్శన్ లో మెగా అభిమానుల హంగామా అంతాఇంతా కాదు . ప్రస్తుతం చరణ్ బోయపాటి శ్రీను దర్శకత్వంలో నటిస్తున్నాడు .

English Title: rangasthalam 100 days function on july 7th

- Advertisement -
Advertisement
Advertisement

టాప్ స్టోరీస్

View All
Advertisement

గాసిప్స్

View All