Homeటాప్ స్టోరీస్మ్యూజిక్ సిట్టింగ్స్ లో "రంగ్ దే"

మ్యూజిక్ సిట్టింగ్స్ లో “రంగ్ దే”

dsp venky atluri
dsp venky atluri

యూత్ స్టార్ నితిన్ హీరోగా నటిస్తున్న చిత్రం రంగ్ దే. వెంకీ అట్లూరి దర్శకుడు. సితార ఎంటర్టైన్మెంట్ పతాకంపై పిడివి ప్రసాద్ సమర్పణలో యస్.నాగవంశీ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు.. రాక్ స్టార్ దేవిశ్రీ ప్రసాద్ సంగీతాన్ని అందిస్తున్నారు.. ప్రస్తుతం ఈ చిత్రం చెన్నైలో పాటల రికార్డింగ్ జరుపుకుంటుంది.

శ్రీమణి పాటలు రాస్తున్నారు.. తొలిప్రేమ, మిస్టర్ మజ్ను, వంటి ప్రేమ కథా చిత్రాలను రూపొందించిన వెంకీ అట్లూరి మరోసారి విభిన్నమైన లవ్ స్టోరీతో ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నారు.. త్వరలోనే సెట్స్ పైకి వెళ్లనున్న ఈ చిత్రాన్ని ప్రముఖ నిర్మాత నాగవంశీ నిర్మించడం రంగ్ దే కి క్రేజ్ నెలకొని ఉంది.

- Advertisement -

వెంకీ, నితిన్ కాంబినేషన్లో ఈ చిత్రం రావడం ఎంతో హ్యాపీగా ఉంది అంటున్నారు నిర్మాతలు.. ఆ మధ్య రిలీజ్ అయిన టైటిల్ పోస్టర్లకు మంచి స్పందన లభించింది.. ఇక వరుస ప్లాపులతో వెనక బడ్డ నితిన్ ఈ రంగ్ దే తోనైనా హిట్ సాధిస్తాడో లేదో చూడాలి మరి..!!

- Advertisement -
Advertisement
Advertisement

టాప్ స్టోరీస్

View All
Advertisement

గాసిప్స్

View All