

బాలీవుడ్ జంట అలియా- రణబీర్ వివాహ బంధం తో ఒకటి కాబోతున్నారని..ఏప్రిల్ 14 న RKstudio లో వీరి వివాహం జరగబోతుందని , భద్రత నేపథ్యంలో వివాహానికి కేవలం 40 మందిని మాత్రమే ఆహ్వానించారని నిన్నటి వరకు వార్తలు వినిపించాయి. కానీ ఇప్పుడు వీరి వివాహ వేడుక రద్దయ్యిందనే వార్తలు బాలీవుడ్ లో చక్కర్లు కొడుతున్నాయి.
భద్రతాపరమైన ఆందోళన కారణంగా వివాహం వాయిదా పడిందనే వార్తలు వినిపిస్తున్నాయి. నిజానికి పెళ్ళి విషయం లీక్ కాగానే భద్రతపై దృష్టిసారించారు. ఇప్పుడు అదే కారణంతో వాయిదా కూడా వేస్తున్నారట. మరోవైపు ఈ పెళ్ళి వచ్చేవారానికి వాయిదా పడనుందని, ఏప్రిల్ 20న జరుగుతుందని అంటున్నారు. మరి ఇది నిజామా కదా అనేది తెలియాల్సి ఉంది.