
బాలీవుడ్ క్రేజీ స్టార్స్ , ప్రేమ జంట రణ్‌బీర్ కపూర్ – అలియా భట్ లు పెళ్లి చేసుకొని ఒకటయ్యారు. ఈరోజు( ఏప్రిల్ 14న) పంజాబ్ సంప్రదాయం ప్రకారం.. వీరి వివాహం జరిగింది. బాంద్రాలోని వాస్తు అపార్ట్‌మెంట్‌లో జరిగిన ఈ పెళ్లికి అతి కొద్దీ మంది కుటుంబ సభ్యులు , సన్నిహితులతో హాజరయ్యారు. చిత్రసీమ నుండి నీతూ కపూర్, కరీనా కపూర్ ఖాన్, కరిష్మా కపూర్, మహేశ్ భట్, సోనీ రజ్దాన్, షాహీన్ భట్, సైఫ్ అలీఖాన్, ఆకాశ్ అంబానీ తదితరులు హాజరయ్యారు.
పెళ్లికి సంబంధించిన ఫొటోలను అలియా సోషల్ మీడియా వేదికగా అభిమానులతో పంచుకుంది. ‘‘ఐదు ఏళ్ల రిలేషన్ షిప్ అనంతరం ఏప్రిల్ 14న బంధువులు, స్నేహితుల సమక్షంలో మేం పెళ్లి చేసుకున్నాం. జంటగా మరెన్నో అనుభూతులను పంచుకోవడానికి మేం ఎంతగానో ఎదురు చూస్తున్నాం. ఈ క్షణం మాకెంతో ప్రత్యేకమైనది’’ అని అలియా భట్ తెలిపింది. ఈ పెళ్లి వేడుక కు సంబంధించిన విషయాలు బయటకు రావద్దని అలియా – రణ్ బీర్ అవసరమైన చర్యలు తీసుకున్నారు. పెళ్లి మండపానికి కెమెరాలు గానీ, సెల్ ఫోన్ లను గానీ అనుమతించలేదు. కేవలం అలియా – రణ్ బీర్ అధికారికంగా నియమించుకున్న కెమెరా మినహా.. మిగితా వాటికి అనుమతి ఇవ్వలేదు. పెళ్లి వేడుక ముగిసిన అనంతరం అలియా – రణ్ బీర్ తమ ఫోటోలను సోషల్ మీడియా ద్వారా పంచుకున్నారు.