Homeగాసిప్స్రానా - మిహీకా పెళ్లి డేట్ ఫిక్స్ చేసిన‌ట్టేనా?

రానా – మిహీకా పెళ్లి డేట్ ఫిక్స్ చేసిన‌ట్టేనా?

రానా - మిహీకా పెళ్లి డేట్ ఫిక్స్ చేసిన‌ట్టేనా?
రానా – మిహీకా పెళ్లి డేట్ ఫిక్స్ చేసిన‌ట్టేనా?

హీరో రానా ద‌గ్గుబాటి ఈ నెల 12న త‌ను పెళ్లిచేసుకోబోతున్న మిహీకా బ‌జాజ్‌ని ప‌రిచ‌యం చేస్తూ షాకిచ్చిన విష‌యం తెలిసిందే. మిహీకా బ‌జాజ్ ముంబై నేప‌థ్యంలో ఈవెంట్ మేనేజ్‌మెంట్ కంపెనీని ర‌న్ చేస్తోంది. గ‌త కొంత కాలంగా డేటింగ్‌లో వున్న రానా, మిహీకా బ‌జాజ్ త్వ‌ర‌లో వివాహ బంధంతో ఒక్క‌టి కాబోతున్నారు.

వీరి ప్రేమ బంధానికి ఇరు కుటుంబాల పెద్ద‌లు గ్రీన్‌సిగ్న‌ల్ ఇవ్వ‌డంతో పెళ్లి బాజాలు త్వ‌ర‌లోనే మోగ‌బోతున్నాయి. ఇటీవ‌లే ఇరు కుటుంబాలు పాల్గొన‌గా రోకా ఫంక్ష‌న్‌ని నిర్వ‌హించారు. ప్ర‌స్తుత ప‌రిస్థితుల నేప‌థ్యంలో రానా, మిహీకాల వివాహాన్ని డిసెంబ‌ర్‌లో జ‌ర‌పాల‌ని రానా ఫాద‌ర్‌, నిర్మాత డి.సురేష్‌బాబు ప్లాన‌ఖ్ చేస్తున్న‌ట్టు ప్ర‌చారం జ‌రిగింది.

- Advertisement -

అయితే తాజా స‌మాచారం ప్ర‌కారం ఆగ‌స్టు 8న రానా, మిహీకాల బ‌జాజ్‌ల వివాహం జ‌ర‌గ‌నుంద‌ని ఇండ‌స్ట్రీ వ‌ర్గాల్లో వినిపిస్తోంది. సోష‌ల్ మీడియాలో ఈ వార్త వైర‌ల్‌గా మారింది. ఇందులో నిజ‌మెంత అనేది తెలియాలంటే రానా ఫాద‌ర్ డి. సురేష్‌బాబు వెల్ల‌డించే వ‌ర‌కు వేచి చూడాల్సిందే. ఇదిలా వుంటే రానా న‌టించిన `అర‌ణ్య‌` చిత్రం త్వ‌ర‌లో ఓటీటీలో రిలీజ్ కాబోతోందంటూ వ‌రుస క‌థ‌నాలు వినిపిస్తున్నాయి. అయితే చిత్ర వ‌ర్గాలు మాత్రం ఈ వార్త‌ల్ని ఖండించ‌డం లేదు.

- Advertisement -
Advertisement
Advertisement

టాప్ స్టోరీస్

View All
Advertisement

గాసిప్స్

View All