
హీరో విశాల్ పై ఓ మహిళ సంచలన ఆరోపణలు చేయడం ఆసక్తికరంగా మారింది. విశాల్ రీల్ లైఫ్‌లోనే హీరో అని, తను రియల్ లైఫ్‌లో మాత్రం పక్కా విలన్ అని విశాల్ కు సంబంధించిన విశాల్ ఫిల్మ్ ఫ్యాక్టరీలో పనిచేస్తున్న రమ్య సంచలన ఆరోపణలు చేసింది. ఇటీవల రమ్యపై విశాల్ నిర్మాణ సంస్థకు చెందిన హరి పోలీసులకు ఫిర్యాదు చేసిన విషయం తెలిసిందే.
గత ఆరు సంవత్సరాలుగా తమ సంస్థలో పనిచేస్తున్న రమ్య నకిలీ డాక్యుమెంట్లతో సంస్థలోని వేలాది రూపాయల్ని తన ఫ్యామిలీ అకౌంట్‌లోకి వేసుకుని సంస్థని మోసం చేసిందని ఇటీవల హరి ఆమెపై ఫిర్యాదు చేసిన సంగతి తెలిసిందే. తాజా ఆరోపణల నేపథ్యంలో రమ్య హీరో విశాల్‌పై ఘాటుగా స్పందించింది. `ఇలాంటివి జరుగుతాయని తనకు ముందే తెలుసునని, అందుకే బలవంతంగా నోరు మూసుకుని ఉండాల్సి వచ్చిందని వెల్లడించింది.
ఆఫీసులో తన ముందే ఎన్నో విషయాలు జరిగాయని, సినిమాల్లో చూసిన విధంగా విశాల్ హీరో కాదని, అతడో విలన్ అని, తన వద్ద అన్ని ఆధారాలు వున్నాయని రమ్య విశాల్‌పై మండిపడింది. ఈ విషయంపై పోలీస్ స్టేషన్‌కి వెళితే తమని అక్కడే చంపేస్తామని విశాల్ మనుషులు బెదిరించారని రమ్య సోదరుడు రాజేష్ వెల్లడించారు.