రాంచరణ్ హీరోగా సుకుమార్ దర్శకత్వంలో మైత్రి మూవీస్ సంస్థ భారీ ఎత్తున నిర్మిస్తున్న చిత్రం ” రంగస్థలం ”. 1985 వ సంత్సరానికి సంబందించిన కథతో తెరకెక్కుతున్న ఈ చిత్రాన్ని మార్చి 30న భారీ ఎత్తున రిలీజ్ చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు . ఇక ఈరోజు సాయంత్రం టీజర్ ని రిలీజ్ చేసారు . టీజర్ చూస్తుంటే రంగస్థలం తప్పకుండా హిట్ అయ్యేలాగే ఉంది , చరణ్ చెవిటి వాడిగా నటించడం అభిమానులు ఎలా రిసీవ్ చేసుకుంటారో కానీ చరణ్ కు మాత్రం ఇది ఛాలెంజింగ్ పాత్ర అనే చెప్పాలి .
గెటప్ పరంగా కానీ , పాత్ర పరంగా కానీ విభిన్నంగా ఉంది . టీజర్ సౌండ్ కూడా అదిరిపోయేలా ఉంది . మొత్తానికి చరణ్ కు ఈ వేసవిలో మంచి హిట్ దొరికినట్లే అని అనిపిస్తోంది టీజర్ చూస్తుంటే . చరణ్ సరసన సమంత నటించగా హాట్ భామ అనసూయ ఓ కీలక పాత్ర పోషిస్తోంది . ఇప్పటికే రంగస్థలం పై భారీ అంచనాలు నెలకొనగా తాజాగా టీజర్ తో ఆ అంచనాలు మరింతగా పెరగడం ఖాయం .
- Advertisement -