Homeఎక్స్ క్లూసివ్వినయ విధేయ రామ సెన్సార్ టాక్

వినయ విధేయ రామ సెన్సార్ టాక్

Ramcharan's Vinaya Vidheya Rama censor talkరాంచరణ్ హీరోగా బోయపాటి శ్రీను దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం ” వినయ విధేయ రామ ”. డివివి దానయ్య నిర్మించిన ఈ చిత్రంలో చరణ్ సరసన కియారా అద్వానీ నటించగా దేవిశ్రీ ప్రసాద్ సంగీతం అందించాడు . ఈనెల 11న ఈ చిత్రం విడుదల అవుతున్న నేపథ్యంలో ఈరోజు సెన్సార్ కార్యక్రమాలను పూర్తిచేసుకుంది వినయ విధేయ రామ . ఈ సినిమాలో హింసాత్మక సన్నివేశాలు కోకొల్లలు గా ఉండటంతో యు / ఏ సర్టిఫికెట్ ఇచ్చారు సెన్సార్ సభ్యులు .

ఫ్యామిలీ ఎమోషన్స్ తో పాటుగా ఊర మాస్ కు మెచ్చే యాక్షన్ సన్నివేశాలు పుష్కలంగా ఉన్నాయట సినిమాలో అందుకే ఈ సినిమా సంక్రాంతి బ్లాక్ బస్టర్ గా నిలిచిపోవడం ఖాయమని అన్నారట సెన్సార్ సభ్యులు . పండగ సెలవులు ఆపై మెగా అభిమానుల దన్ను ఉంటుంది కాబట్టి ఈ సినిమా రికార్డుల మోత మోగించడం ఖాయమని ధీమాగా ఉన్నారు వినయ విధేయ రామ చిత్ర బృందం . ప్రేక్షకులను అలరించే అన్ని అంశాలు ఉన్న చిత్రం కావడంతో భారీ హిట్ కొట్టబోతున్నాం అంటూ సంతోషాన్ని వ్యక్తం చేస్తున్నారు చిత్ర బృందం .

- Advertisement -

English Title: Ramcharan’s Vinaya Vidheya Rama censor talk 

- Advertisement -
Advertisement
Advertisement

టాప్ స్టోరీస్

View All
Advertisement

గాసిప్స్

View All