Homeటాప్ స్టోరీస్బోయపాటి వేటుకి చిరుత బలి

బోయపాటి వేటుకి చిరుత బలి

Ramcharan gets disaster with boyapatiఅప్పుడెప్పుడో బోయవాని వేటుకి గాయపడిన కొయిలా అంటూ మోహన్ బాబు ఓ పాట పాడాడు రౌడీ మొగుడు చిత్రంలో …… కానీ ఇన్నాళ్లకు బోయపాటి వేటుకి గాయపడిన చిరుత అంటూ గోడు వెళ్లబోసుకుంటున్నారు మెగా అభిమానులు. ఈరోజు విడుదలైన వినయ విధేయ రామ చిత్రం డిజాస్టర్ టాక్ తెచ్చుకుంది. బోయపాటి మాస్ పల్స్ బాగా తెలిసిన దర్శకుడు కావడంతో చరణ్ అతడ్ని గుడ్డిగా నమ్మినట్లున్నాడు.

అతడు కథ ఏం చెప్పాడో ? చరణ్ దేనికి ఊ కొట్టాడో కానీ వినయ విధేయ రామ చిత్రంలో మాత్రం అసలు హైలెట్ అని చెప్పుకోవడానికి కనీసం రెండు సీన్లయినా లేవు. ఒకే ఒకటి చరణ్ రాంబో గెటప్ లో కనిపించే సీన్ మాత్రం మెగా ఫ్యాన్స్ కు మాత్రమే కాకుండా మిగతా ప్రేక్షకులను అలరించే అంశం . ఇంటకుమించి మరో సీన్ కూడా లేదు సినిమా మొత్తంలో . ఇంత దారుణంగా ఉన్న సినిమా ఎలా ఒప్పుకున్నాడు , ఎలా డబ్బింగ్ చెప్పాడు అని గుసగుసలు వినిపిస్తున్నాయి. మొత్తానికి బోయపాటి ని గుడ్డిగా నమ్మి చిరుత బలయ్యాడు. రంగస్థలం చిత్రం తర్వాత డిజాస్టర్ తో చరణ్ కుదేలయ్యాడు.

- Advertisement -

English Title: Ramcharan gets disaster with boyapati

- Advertisement -
Advertisement
Advertisement

టాప్ స్టోరీస్

View All
Advertisement

గాసిప్స్

View All