రాంచరణ్ అల్లు అర్జున్ రికార్డ్ ని బద్దలు కొట్టాడు . అల్లు అర్జున్ నటించిన సరైనోడు చిత్రం ఫుల్ రన్ లో 115 కోట్లు వసూల్ చేయగా చరణ్ నటించిన రంగస్థలం చిత్రం కేవలం 7 రోజుల్లోనే 130 కోట్ల భారీ వసూళ్ల ని వసూల్ చేసి సరైనోడు రికార్డ్ ని తుక్కు తుక్కు చేసింది . ఫుల్ రన్ లో వచ్చిన మొత్తాన్ని కేవలం వారం రోజుల్లోనే సాధించించాడంటే ముందు ముందు మహేష్ , ఎన్టీఆర్ , పవన్ కళ్యాణ్ ల రికార్డ్ లు కూడా బద్దలు అవుతాయేమో అని భావిస్తున్నారు ట్రేడ్ విశ్లేషకులు .
మార్చి 30న ప్రపంచ వ్యాప్తంగా భారీ ఎత్తున విడుదలైన రంగస్థలం చిత్రం భారీ వసూళ్లు సాధిస్తూ పలు రికార్డ్ లను బద్దలు కొడుతోంది . రెండు తెలుగు రాష్ట్రాలలోనే కాకుండా ఓవర్ సీస్ లో సైతం భారీగా కలెక్షన్లు సాధిస్తున్నాడు చరణ్ . మగధీర తర్వాత చరణ్ ఇండస్ట్రీ హిట్ మళ్ళీ కొట్టేలా కనిపిస్తున్నాడు . సుకుమార్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ చిత్రంలో చరణ్ సరసన సమంత నటించగా దేవిశ్రీ ప్రసాద్ సంగీతం అందించాడు .