Homeటాప్ స్టోరీస్బెస్ట్ పెర్ఫార్మెన్స్ ఇచ్చిన చరణ్

బెస్ట్ పెర్ఫార్మెన్స్ ఇచ్చిన చరణ్

ramcharan best perfarmance in rangasthalam హీరోగా పదకొండేళ్ల కెరీర్ లో రాంచరణ్ బెస్ట్ పెర్ఫార్మెన్స్ ఇచ్చాడంటే అది రంగస్థలం చిత్రంలోనే . అతడి కెరీర్ లో పలు హిట్ లు బ్లాక్ బస్టర్ లు ఉన్నాయి కానీ అద్భుతమైన నటన ప్రదర్శించే అవకాశం మాత్రం చరణ్ కు రంగస్థలం చిత్రంలోనే లభించింది . చరణ్ నటన గురించి ఎంత చెప్పినా తక్కువే అంతటి అభినయాన్ని ప్రదర్శించాడు చరణ్ . చెవిటి వాడిగా చరణ్ చూపిన అభినయం నభూతో నభవిష్యత్ అన్న రీతిలో సాగింది .

సుకుమార్ దర్శకత్వంలో మైత్రి మూవీస్ సంస్థ నిర్మించిన రంగస్థలం ఈరోజు ప్రపంచ వ్యాప్తంగా విడుదల అయ్యింది . విడుదలైన అన్ని ఏరియాలలో బ్రహ్మాండమైన రెస్పాన్స్ వస్తోంది . చరణ్ పై మెగా అభిమానులే కాదు మిగతా ప్రేక్షకులు కూడా ప్రశంసల వర్షం కురిపిస్తున్నారు . మొత్తానికి సమ్మర్ బ్లాక్ బస్టర్ గా రంగస్థలం నిలిచే అవకాశం ఉంది .

- Advertisement -
Advertisement
Advertisement

టాప్ స్టోరీస్

View All
Advertisement

గాసిప్స్

View All