
ఒకప్పటి అగ్ర నటి రంభ..మళ్లీ చిత్రసీమలో అడుగుపెట్టబోతున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. ” ఆ ఒక్కటి అడక్కు” చిత్రంతో తెలుగులో హీరోయిన్ గా ఎంట్రీ ఇచ్చిన ఈమె.. తొలి చిత్రమే బ్లాక్ బస్టర్ హిట్ కావడంతో ఆమెకు వరుసగా అవకాశాలొచ్చాయి. తమిళ, మలయాళ, కన్నడ, హిందీ, బోజ్పూరి, బెంగాలీ చిత్రాల్లో సైతం నటించి సత్తా చాటుకుంది. 12 ఏళ్ల క్రితం సినిమాలకు గుడ్ బై చెప్పి బిజినెస్ మెన్ ఇంద్ర కుమార్ ను పెళ్లి చేసుకొని కుటుంబ బాధ్యతల్లో బిజీ గా ఉంది.
ఆ మధ్యలో కొన్ని టీవీ షోలకు జడ్జిగా వ్యవహరించింది.ఈ క్రమంలో చాలా రోజుల గ్యాప్ తర్వాత ఓ తమిళ చిత్రంతో వెండితెరపై రీ ఎంట్రీ ఇవ్వనుండడం విశేషంగా మారింది.కార్తీ హీరో గా నటిస్తున్న ” సర్దార్” చిత్రంలో రంభ కీలక పాత్ర పోషిస్తున్నట్లు సమాచారం. పీయన్ మిత్రన్ ” సర్దార్ ” చిత్రాన్ని డైరెక్ట్ చేస్తుండగా.. ప్రిన్స్ పిక్చర్స్ సంస్థ నిర్మిస్తోంది. మరి రంభ కు ఈ రీ ఎంట్రీ మూవీ ఎంత కలిసొస్తుందో చూడాలి.