HomeVideos`రామ‌రాజు ఫ‌ర్ భీమ్` స‌రికొత్త రికార్డ్‌!

`రామ‌రాజు ఫ‌ర్ భీమ్` స‌రికొత్త రికార్డ్‌!

`రామ‌రాజు ఫ‌ర్ భీమ్` స‌రికొత్త రికార్డ్‌!
`రామ‌రాజు ఫ‌ర్ భీమ్` స‌రికొత్త రికార్డ్‌!

యంగ్ టైగ‌ర్ ఎన్టీఆర్, మెగా ప‌వ‌ర్‌స్టార్ రామ్‌చ‌ర‌ణ్ తొలిసారి క‌లిసి న‌టిస్తున్న`ఆర్ఆర్ఆర్` రిలీజ్‌కి ముందే రికార్డుల మోత మోగిస్తోంది. రాజ‌మౌళి అత్యంత ప్ర‌తిష్టాత్మ‌కంగా తెర‌కెక్కిస్తున్న ఈ మూవీ ప్రారంభం నుంచి దేశ వ్యాప్తంగా హాట్ టాపిక్‌గా మారింది. డీవీవీ దాన‌య్య నిర్మిస్తున్న ఈ మూవీకి సంబంధించిన ప్ర‌తీ విష‌యం ఇప్ప‌టి వ‌ర‌కు టాప్ న్యూస్‌లో నిలుస్తూ వ‌స్తోంది.

తాజాగా ఈ మూవీ నుంచి విడుద‌ల చేసిన రామ‌రాజు ఫ‌ర్ భీమ్‌` వీడియో స‌రికొత్త రికార్డుని సృష్టించింది. యంగ్‌టైగ‌ర్ ఎన్టీఆర్ పుట్టిన రోజు సంద‌ర్బంగా  భీమ్ పాత్ర‌ని రామ‌రాజు ప‌రిచ‌యం చేసిన వీడియోని విడుద‌ల చేశారు. ఈ వీడియోకి రామ‌రాజు పాత్రధారి మెగా వ‌ప‌ర్‌స్టార్ రామ్‌చ‌ర‌ణ్ వాయిస్ ఓవ‌ర్ అందించిన విష‌యం తెలిసిందే. రోమాంచిత స‌న్నివేశాల‌తో ఐ ఫీస్ట్ విజువ‌ల్స్‌తో రామ‌రాజు ఫ‌ర్ భీమ్ వీడియో సాగింది. గ‌త ఏడాది అక్టోబ‌ర్ 22న దీనికి సంబంధించిన టీజ‌ర్‌ని విడుద‌ల చేశారు. ప‌లు భాష‌ల్లో విడుద‌లైన ఈ టీజ‌ర్‌ ఇప్ప‌టికే 50 మిలియ‌న్ల వ్యూస్‌ని దాటింది.

- Advertisement -

టీజర్ 50 మిలియన్ల వ్యూస్‌ని దాట‌డంతో ఇలా 50 మిలియ‌న్‌ల వ్యూస్‌ని అధిగ‌మించిన కొత్త రికార్డును సృష్టించింది. అంతే కాకుండా ఈ మైలురాయిని సాధించిన మొట్టమొదటి తెలుగు టీజర్‌గా స‌రికొత్త మైల్‌స్టోన్‌ని సాధించింది. ఈ టీజర్‌లో 1.3 మిలియన్లకు పైగా లైక్‌లు, 53 కె అన్ లైక్‌లు ఉన్నాయి. రిలీజ్‌కు ముందే స‌రికొత్త మైల్ స్టోన్‌ల‌ని సెట్ చేస్తున్న ఈ మూవీలో అజయ్ దేవ్‌గన్, అలియా భట్, ఒలివియా మోరిస్, సముద్ర‌ఖ‌ని, అలిసన్ డూడీ, మరియు రే స్టీవెన్‌సన్ కీల‌క పాత్ర‌ల్లో న‌టిస్తున్నారు. దాదాపు 400 కోట్ల భారీ బ‌డ్జెట్‌తో రూపొందుతున్న ఈ మూవీని వ‌ర‌ల్డ్ వైడ్‌గా అక్టోబర్ 13 న పలు భాషల్లోవిడుద‌ల చేయ‌బోతున్నారు.

YouTube video

- Advertisement -
Advertisement
Advertisement

టాప్ స్టోరీస్

View All
Advertisement

గాసిప్స్

View All