HomeVideosవచ్చేస్తున్నా 'రామారావు ఆన్ డ్యూటీ' టీజర్..

వచ్చేస్తున్నా ‘రామారావు ఆన్ డ్యూటీ’ టీజర్..

వచ్చేస్తున్నా 'రామారావు ఆన్ డ్యూటీ' టీజర్..
వచ్చేస్తున్నా ‘రామారావు ఆన్ డ్యూటీ’ టీజర్..

మాస్ మహారాజ్ రవితేజ జెట్ స్పీడ్ లో ఉన్నాడు. గత ఏడాది క్రాక్ తో సూపర్ హిట్ అందుకున్న రవితేజ ప్రస్తుతం ఒకటి రెండు కాదు ఏకంగా నాల్గు సినిమాలను లైన్లో పెట్టాడు. రీసెంట్ గా ఖిలాడీ తో ప్రేక్షకుల ముందుకు వచ్చిన రవితేజ..ఈ సినిమా బాగా డిస్పాయింట్ చేసింది. అయినప్పటికీ ఏమాత్రం జోష్ తగ్గించుకోకుండా తదుపరి సినిమాలను పూర్తి చేసే పనిలో ఉన్నాడు. వాటిలో రామారావు ఆన్ డ్యూటీ ఒకటి. నూతన దర్శకుడు శరత్ మండవ తెరకెక్కిస్తున్న సినిమా ప్రస్తుతం శరవేగంగా షూటింగ్ జరుపుకుంటోంది.

ఇప్పటికే ఈ సినిమా నుంచి వచ్చిన ప్రీ లుక్, ఫస్ట్ లుక్ పోస్టర్స్ ఆకట్టుకోగా.. ఇప్పుడు ఈ మూవీ నుంచి దర్శకుడు శరత్ మండవ ఓ లేటెస్ట్ అప్డేడ్‌ను షేర్ చేసి అభిమానుల్లో సంతోషం నింపారు.’రామారావు ఆన్ డ్యూటీ’ సినిమా నుంచి అతి త్వరలో టీజర్‌ను రిలీజ్ చేయబోతున్నట్లు తెలిపారు. ఈ సినిమాలో రవితేజ సరసన మజిలీ ఫేమ్ దివ్యాన్షా కౌశిక్ హీరోయిన్‌గా నటిస్తోంది.

- Advertisement -

రజీష విజయన్ మరో హీరోయిన్‌గా కనిపించబోతోంది. దీనికి సామ్ సి ఎస్ సంగీతం అందిస్తున్నాడు. ఇక ఈ సినిమా మార్చ్ 25 లేదా ఏప్రిల్ 15న రిలీజ్ చేసేందుకు మేకర్స్ సన్నాహాలు చేస్తున్నారు. ఈ సినిమాతో పాటు రవితేజ.. ధమాకా, టైగర్ నాగేశ్వరరావు, రావణాసుర చిత్రాలు చేస్తున్నారు.

- Advertisement -
Advertisement
Advertisement

టాప్ స్టోరీస్

View All
Advertisement

గాసిప్స్

View All