
హీరో రామ్..ప్రస్తుతం తమిళ్ డైరెక్టర్ లింగుస్వామి డైరెక్షన్లో ది వారియర్ అనే మూవీ చేస్తున్నాడు. ఈ మూవీలో రామ్ సరసన కృతి శెట్టి హీరోయిన్ గా నటిస్తుండగా.. ఆది పినిశెట్టి విలన్ గా కనిపించనున్నాడు. ఈ సినిమాలో పోలీసాఫీసర్ గా రామ్ కనిపిస్తుండడం..రీసెంట్ గా రిలీజ్ చేసిన పోస్టర్స్ ఆకట్టుకోవడం తో సినిమా ఫై ఆసక్తి పెరిగింది. జులై 14 న వరల్డ్ వైడ్ గా రిలీజ్ కాబోతుంది. తాజాగా ఈ మూవీ లోని బుల్లెట్ సాంగ్ ను ఈ నెల 22 సాయంత్రం 5 : 45 కు రిలీజ్ చేయబోతున్నట్లు అధికారికంగా తెలిపారు.
ఈ సినిమాలో హీరోయిన్‌గా ఉప్పెన ఫేమ్ కృతిశెట్టి నటిస్తోంది. తెలుగు, తమిళ భాషల్లో ఏకకాలంలో విడుదల కాబోతుంది. దేవి శ్రీ ప్రసాద్ సంగీతం అందిస్తున్న ఈ సినిమాని శ్రీనివాస సిల్వర్ స్క్రీన్ పతాకం పై శ్రీనివాస చిట్టూరీ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఇక ఈ సినిమా హిందీ డబ్బింగ్ రైట్స్‌తో పాటు శాటిలైట్ రైట్స్ కూడా అమ్ముడుపోయినట్టు సమాచారం. తెలుగు, తమిళ భాషలకు కలిపి డిస్నీ హాట్ స్టార్ రూ. 35 కోట్లకు కొనుగోలు చేసినట్టు సమాచారం. మొత్తంగా డిజిటల్, శాటిలైట్, డబ్బింగ్ రూపేణా.. నాన్ థియేట్రికల్‌గా ఈ సినిమాకు రూ. 41 కోట్ల లాభం విడుదలకు ముందే వచ్చింది.