Homeటాప్ స్టోరీస్జులై 14 న రామ్ ది వారియర్ రిలీజ్

జులై 14 న రామ్ ది వారియర్ రిలీజ్

ram the warrior release on July 14th
ram the warrior release on July 14th

ఈరోజు ఉగాది సందర్భాంగా హీరో రామ్ తన కొత్త చిత్రం ది వారియర్ సినిమా తాలూకా పోస్టర్ రిలీజ్ చేసి..రిలీజ్ డేట్ ను ప్రకటించి అభిమానుల్లో సంతోషం నింపారు. రెడ్ తో పెద్దగా ఆకట్టుకోలేకపోయిన హీరో రామ్..ప్రస్తుతం తమిళ్ డైరెక్టర్ లింగుస్వామి డైరెక్షన్లో ది వారియర్ అనే మూవీ చేస్తున్నాడు. ఈ మూవీలో రామ్ సరసన కృతి శెట్టి హీరోయిన్ గా నటిస్తుండగా.. ఆది పినిశెట్టి విలన్ గా కనిపించనున్నాడు. ఈ సినిమాలో పోలీసాఫీసర్ గా రామ్ కనిపిస్తుండడం..రీసెంట్ గా రిలీజ్ చేసిన పోస్టర్స్ ఆకట్టుకోవడం తో సినిమా ఫై ఆసక్తి పెరిగింది. ఈరోజు ఉగాది సందర్బంగా సరికొత్త పోస్టర్ రిలీజ్ చేసి , సినిమాను జులై 14 న వరల్డ్ వైడ్ గా రిలీజ్ చేస్తున్నట్లు ప్రకటించారు.

అలాగే ఈ మూవీ శాటిలైట్, డిజిటల్ రైట్స్ భారీ ధరకు స్టార్ మా ఛానల్ దక్కించుకున్నట్లు తెలుస్తుంది. ఇక డిజిటల్ రైట్స్ సైతం డిస్నీ హాట్ స్టార్ రూ. 35 కోట్ల రూపాయలకు దక్కించుకున్నట్లు సమాచారం. రామ్ కెరియర్ లోనే ఇదే పెద్ద అమౌంట్ అని చెపుతున్నారు. ఇక ఈ సినిమాతో కోలీవుడ్ లో కూడా అడుగుపెడుతున్నాడు రామ్. దీంతో అందరికి ఈ సినిమా ఫై అంచనాలు పెరుగుతున్నాయి.

- Advertisement -
Advertisement
Advertisement

టాప్ స్టోరీస్

View All

గాసిప్స్

View All

Latest Posts