Homeటాప్ స్టోరీస్రామ్ ద్విభాషా చిత్రం సెట్స్ మీదకు

రామ్ ద్విభాషా చిత్రం సెట్స్ మీదకు

రామ్ ద్విభాషా చిత్రం సెట్స్ మీదకు
రామ్ ద్విభాషా చిత్రం సెట్స్ మీదకు

ఉస్తాద్ రామ్ పోతినేని తన తర్వాతి చిత్రాన్ని మొదలుపెడుతున్నాడు. ఈ ఏడాది రెడ్ సినిమాను విడుదల చేసిన రామ్ తన నెక్స్ట్ సినిమాను ఈ ఏడాది మొదట్లోనే ప్రకటించాడు. తమిళ దర్శకుడు లింగుసామి తెరకెక్కించనున్న ఈ సినిమా షూటింగ్ ఇప్పుడు మొదలైంది. ఈరోజు నుండి షూటింగ్ మొదలైనట్లు అధికారికంగా ప్రకటించారు.

ఈ సినిమాను తెలుగుతో పాటు తమిళంలో కూడా తెరకెక్కిస్తున్నారు. రామ్ సరసన కృతి శెట్టి ఈ చిత్రంలో హీరోయిన్ గా నటిస్తోంది. ఉప్పెన సినిమాతో సూపర్ డూపర్ హిట్ ను అందుకున్న కృతికి వరసగా అవకాశాలు వస్తున్నాయి. ఈ చిత్ర మొదటి షెడ్యూల్ కొన్ని రోజుల పాటు హైదరాబాద్ లో జరగనుంది.

- Advertisement -

ఈ చిత్రానికి ఉస్తాద్ టైటిల్ ను పరిశీలిస్తున్నారు. అయితే దీనిపై అధికారిక ప్రకటన రావాల్సి ఉంది. మరోవైపు ఈ సినిమాకు సంబంధించిన మరిన్ని వివరాలు త్వరలోనే తెలిసే అవకాశముంది.

- Advertisement -
Advertisement
Advertisement

టాప్ స్టోరీస్

View All
Advertisement

గాసిప్స్

View All