Tuesday, September 27, 2022
Homeటాప్ స్టోరీస్స్మాల్ బ్రేక్ అంటున్న ఎన‌ర్జిటిక్ హీరో!

స్మాల్ బ్రేక్ అంటున్న ఎన‌ర్జిటిక్ హీరో!

స్మాల్ బ్రేక్ అంటున్న ఎన‌ర్జిటిక్ హీరో!
స్మాల్ బ్రేక్ అంటున్న ఎన‌ర్జిటిక్ హీరో!

`ఇస్మార్ట్ శంక‌ర్‌`తో మ‌ళ్లీ ట్రాక్‌లోకి వ‌చ్చారు ఎన‌ర్జిటిక్ హీరో, ఉస్తాద్ రామ్‌. ఈ మూవీ రికార్డు వ‌సూళ్ల‌ని సాధించి రామ్‌ని మాస్ హీరోల జాబితాలో చేర్చింది. ఈ మూవీ ఇచ్చిన స‌క్సెస్ ఆనందంలో వున్న రామ్ త‌న త‌దుప‌రి చిత్రాన్ని కిషోర్ తిరుమ‌ల ద‌ర్శ‌క‌త్వంలో ప‌ట్టాలెక్కించారు. ఈ సారి థ్రిల్ల‌ర్ ఎంట‌ర్‌టైన‌ర్‌ని ఎంచుకున్న రామ్ త‌మిళ హిట్ చిత్రం `త‌డ‌మ్‌` ఆధారంగా ఈ చిత్రాన్ని చేశారు. `రెడ్‌` నేరుతో రూపొందిన ఈ చిత్రం ఈ సంక్రాంతికి విడుద‌లై ఫ‌ర‌వాలేద‌నిపించుకుంది.

- Advertisement -

రామ్ తొలిసారి డ్యుయ‌ల్ రోల్‌లో న‌టించిన ఈ చిత్రం ఆశించిన స్థాయిలో మాత్రం ఆక‌ట్టుకోలేక‌పోయింది. ఈ మూవీ త‌రువాత రామ్ మాట‌ల మాంత్రికుడు త్రివిక్ర‌మ్ తో సినిమా చేస్తార‌ని ప్ర‌చారం జ‌రిగింది. కానీ అది కార్య‌రూపం దాల్చ‌డానికి ఇంకా స‌మ‌యం ప‌డుతుంద‌ని, టాక్స్ మాత్రం జ‌రుగుతున్నాయ‌ని రామ్‌తో పాటు ఆయ‌న పీఆర్ టీమ్ వెల్ల‌డించింది.

ఇదిలా వుంటే బ్రేక్ తీసుకుంటాన‌ని వెల్ల‌డించిన రామ్ తాజాగా శివ మాలని ధ‌రించారు. ఇందుకు సంబంధించిన ఫొటోని సోష‌ల్ మీడియాలో షేర్ చేశారు. శివ మాల ధ‌రించి 41 రోజుల పాటు నిష్ట‌గా వుండ‌బోతున్నార‌ట‌. ఈ మాల పూర్త‌యిన త‌రువాతే త‌న త‌దుప‌రి చిత్రానికి సంబంధించిన అప్‌డేట్‌ని అందించే ఆలోచ‌న‌లో రామ్ వున్న‌ట్టు తెలిసింది.

Advertisement
Advertisement

టాప్ స్టోరీస్

View All

గాసిప్స్

View All

Latest Posts