Homeటాప్ స్టోరీస్సౌత్ లో ఏ హీరోకు దక్కని రికార్డు హీరో రామ్ కు దక్కింది

సౌత్ లో ఏ హీరోకు దక్కని రికార్డు హీరో రామ్ కు దక్కింది

Ram Pothineni sets a new record on YouTube
Ram Pothineni sets a new record on YouTube

దేవదాస్ మూవీ తో ఇండస్ట్రీ లో హీరోగా ఎంట్రీ ఇచ్చిన రామ్..మొదటి సినిమాతోనే యూత్ స్టార్ అయ్యాడు. ఆ తర్వాత రెడీ మూవీ రామ్ ను ఫ్యామిలీ ఆడియన్స్ కు దగ్గర చేసింది. ఈ మధ్యనే ఇస్మార్ట్ శంకర్ తో మాస్ స్టార్ గా గుర్తింపు తెచ్చుకున్నాడు. ప్రస్తుతం తమిళ్ డైరెక్టర్ లింగుస్వామి డైరెక్షన్లో ది వారియర్ అనే మూవీ చేస్తున్నాడు. ఇదిలా ఉంటె తాజాగా రామ్ సౌత్ ఇండస్ట్రీ లో ఏ హీరో కు దక్కని గౌరవం , రికార్డు దక్కింది.

ప్రస్తుతం తెలుగు సినిమాలు హిందీ లో డబ్ అయ్యి యూట్యూబ్ లో మిలియన్ల వ్యూస్ తో అదరగొడుతున్నాయి. ఈ క్రమంలో రామ్ నటించిన దేవదాస్ దగ్గరి నుండి మొన్నటి రెడ్ వరకు అన్ని హిందీ లో డబ్ అవుతూ వచ్చాయి. ఆలా ఇప్పటివరకు రామ్ సినిమాలన్నీ యూట్యూబ్ లో హిందీ వెర్షన్ లో రిలీజ్ అయ్యి ఏకంగా 2 బిలియన్ వ్యూస్ రాబట్టాయి. దీనితో ఈ 2 బిలియన్ వ్యూస్ అందుకున్న ఏకైక దక్షిణాది హీరోగా రామ్ సెన్సేషనల్ రికార్డు అందుకున్నాడు. మరి ఇప్పుడు తాను నటిస్తున్న “ది వారియర్” సినిమాను హిందీ లో రిలీజ్ చేయాలనీ ప్లాన్ చేస్తున్నాడట.

- Advertisement -
Advertisement
Advertisement

టాప్ స్టోరీస్

View All
Advertisement

గాసిప్స్

View All