Homeటాప్ స్టోరీస్ఇస్మార్ట్ హ్యాంగోవర్ లోనే రామ్

ఇస్మార్ట్ హ్యాంగోవర్ లోనే రామ్

Ram Pothineni
Ram Pothineni

ఎనర్జిటిక్ స్టార్ రామ్ కెరీర్ కు గొప్ప బూస్ట్ ఇచ్చింది ఇస్మార్ట్ శంకర్. రామ్ కెరీర్ లోనే బిగ్గెస్ట్ హిట్ గా నిలవడమే కాకుండా, రామ్ కు గొప్ప మేకోవర్ చిత్రంగా ఇస్మార్ట్ శంకర్ నిలిచింది.

రామ్ మ్యానరిజమ్స్, డైలాగ్ డెలివరీకి ప్రేక్షకులు ఫిదా అయిపోయారు. రామ్ కు తన కొత్త యాటిట్యూడ్ బాగా నచ్చేసింది. సాఫ్ట్ రోల్స్ వేసి వేసి విసిగిపోయి ఉన్న రామ్ కు ఇస్మార్ట్ లో మాస్ రోల్ రెఫ్రెషింగ్ గా అనిపించింది.

- Advertisement -

అయితే వచ్చిన చిక్కల్లా రామ్ ఇంకా ఇస్మార్ట్ హ్యాంగోవర్ లోనే ఉన్నాడు. తన తర్వాత చిత్రం కిషోర్ తిరుమల డైరెక్షన్ లో ఉండగా మనోడు సడెన్ గా అందులో మాస్ ఎలిమెంట్స్ జోడించమని, పంచ్ డైలాగులను పెంచమని సలహా ఇస్తున్నాడట. నిజానికి కిషోర్ తిరుమల సాఫ్ట్ డైరెక్టర్. అతని పాత సినిమాలు చూస్తే మాస్ కు అతను బాగా దూరం అన్న విషయం ఇట్టే అర్ధమవుతుంది. మరి ఇలాంటి దర్శకుడి చేత అలాంటి స్క్రిప్ట్ రాయిస్తే అవుట్ ఫుట్ ఏం తేడా కొట్టేయదు కదా.

- Advertisement -
Advertisement
Advertisement

టాప్ స్టోరీస్

View All
Advertisement

గాసిప్స్

View All