Homeటాప్ స్టోరీస్'ఇస్మార్ట్' రామ్ ఇప్పుడు రఫ్ అండ్ టఫ్ 'రెడ్'

‘ఇస్మార్ట్’ రామ్ ఇప్పుడు రఫ్ అండ్ టఫ్ ‘రెడ్’

First Look of Ram Pothineni Red
First Look of Ram Pothineni Red

వరస ప్లాపులతో సతమతమైన రామ్ ఎట్టకేలకు ఇస్మార్ట్ శంకర్ సినిమాతో బ్లాక్ బస్టర్ హిట్ కొట్టాడు. రామ్ కెరీర్ లోనే హైయెస్ట్ గ్రాసర్ గా ఈ చిత్రం నిలిచింది. దీంతో రామ్ కెరీర్ సైడ్ ట్రాక్ నుండి మెయిన్ ట్రాక్ కు ఎక్కినట్లైంది. ఈ నేపథ్యంలో రామ్ వెంటనే మరో సినిమా ప్రకటిస్తాడని అంతా ఆశించారు. ఎందుకంటే హిట్ కొట్టిన ఊపులోనే హీరోలు నిర్ణయాలు తీసుకుంటుంటారు. అయితే రామ్ అసలు కంగారు పడకుండా పూర్తిగా టైమ్ తీసుకున్నాడు. ఇస్మార్ట్ శంకర్ ఫీవర్ మొత్తం తగ్గాక అప్పుడు తీరిగ్గా ఆలోచించి రీమేక్ సినిమాను సెట్ చేసాడు. తనతో రెండు సినిమాలు చేసిన కిషోర్ తిరుమలను దర్శకుడిగా ఎంచుకున్నాడు. ఇదివరకు ఇద్దరూ కలిసి నేను శైలజ, ఉన్నది ఒకటే జిందగీ చిత్రాలతో ప్రేక్షకులను పలకరించారు. మొదటి సినిమా సూపర్ హిట్ కాగా రెండో సినిమా యావరేజ్ గా నిలిచింది. దీంతో హ్యాట్రిక్ చిత్రం ఎలా ఉంటుందా అని అందరూ ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.

నిన్న దీపావళి సందర్భంగా సినిమాను ప్రకటించిన రామ్, ఈరోజు ఫస్ట్ లుక్ మరియు టైటిల్ ను రివీల్ చేసాడు. పూర్తిగా రఫ్ అండ్ టఫ్ లుక్ లోకి రామ్ మారిపోయాడు. జుట్టు కూడా మొత్తం తగ్గించేసి రా గా కనిపిస్తున్నాడు. స్కిన్ టోన్ ను కూడా డౌన్ చేసారు. ఈ చిత్రానికి రెడ్ అనే టైటిల్ ను ప్రకటించారు. తమిళంలో అరుణ్ విజయ్ నటించిన సూపర్ హిట్ చిత్రం తడం రీమేక్ గా రెడ్ తెరకెక్కుతోంది. ఇందులో హీరోకు డ్యూయల్ రోల్. సిటీలో జరిగిన మర్డర్ మిస్టరీతో ఆసక్తికరంగా నడిచే కథనం ఈ చిత్రం. ఆ మర్డర్ ఇద్దరు హీరోల్లో ఒకరి మీద పడుతుంది. ఇద్దరూ ఒకేలా ఉండడంతో ఎవరు నేరస్థులు అన్నది పోలీసులకు కన్ఫ్యుజింగ్ గా మారుతుంది. చివరికి ఆ ఇద్దరికీ మర్డర్ వల్ల ఎలాంటి పరిణామాలు ఎదురయ్యాయన్నది మిగతా కథ. సో, రామ్ కూడా ఈ చిత్రంలో డ్యూయల్ రోల్ లో కనిపించబోతున్నాడు.

- Advertisement -

మణిశర్మ సంగీతం అందించనున్న ఈ చిత్రాన్ని స్రవంతి రవికిశోర్ నిర్మించనున్నాడు. నవంబర్ 16 నుండి ఈ సినిమా చిత్రీకరణను మొదలుపెట్టనున్నారు. వచ్చే ఏడాది వేసవికి సినిమాను సిద్ధం చేసేలా షెడ్యూల్స్ ఖరారయ్యాయి. హీరోయిన్ మరియు ఇతర నటీనటుల, సాంకేతిక నిపుణుల వివరాలు త్వరలోనే అధికారికంగా వెల్లడించనున్నారు.

హిట్ వచ్చిన ప్రతీసారి ప్లాప్ వస్తుంది రామ్ కెరీర్ లో. అందుకే హీరోగా నెక్స్ట్ లెవెల్ కు వెళ్లలేకపోయాడు. కానీ ఇస్మార్ట్ శంకర్ సక్సెస్ ఇచ్చిన కాన్ఫిడెన్స్ లో రామ్ తన నిర్ణయం ఈసారి తప్పదని ధీమాగా ఉన్నాడు. ‘రెడ్’ రామ్ కెరీర్ లో 18వ చిత్రం కావడం విశేషం. రెడ్ కు సినెమాటోగ్రాఫర్ గా సమీర్ రెడ్డి ఎంపికయ్యాడు. ఫైట్స్ పీటర్ హైన్స్ ఆధ్వర్యంలో రూపొందనున్నాయి. చాలా కాలం తర్వాత పీటర్ హైన్స్ తిరిగి తెలుగు సినిమాలకు పనిచేస్తుండడం విశేషం. మరి రెడ్ తో రామ్ ఇస్మార్ట్ సక్సెస్ ను కంటిన్యూ చేస్తాడా లేదా అన్నది చూడాలి.

- Advertisement -
Advertisement
Advertisement

టాప్ స్టోరీస్

View All
Advertisement

గాసిప్స్

View All