Homeటాప్ స్టోరీస్వ‌ర్మ ప‌బ్లిసీటీ పీక్స్‌కు చేరుకుందిగా!

వ‌ర్మ ప‌బ్లిసీటీ పీక్స్‌కు చేరుకుందిగా!

 

Ram Gopal Varma tuches the feet of naina ganguly 
Ram Gopal Varma tuches the feet of naina ganguly

రామ్‌గోపాల్‌వ‌ర్మ ఏది చేసినా ఈ మ‌ధ్య ఓ సంచ‌ల‌న‌మే అవుతోంది. వివాదాస్ప‌ద అంశాల‌నే త‌న చిత్రాల‌కు క‌థా వ‌స్తువుగా ఎంచుకుని వ‌రుస వివాదాల్ని సృష్టిస్తున్న వ‌ర్మ త‌న సినిమాల‌ని ప్ర‌మోట్ చేసుకోవ‌డంతోనూ అదే పంథాను అనుస‌రిస్తూ ఉభయు తెలుగు రాష్ట్రాల్లో ర‌చ్చ చేస్తున్నారు. తాజాగా ఆయ‌న ఆగ‌స్త్య మంజుతో నిర్మించిన చిత్రం `బ్యూటిఫుల్‌`. రంగీలా చిత్రానికి ట్రిబ్యూట్ అంటూ ప్ర‌చారం మొద‌లుపెట్టిన ఈ సినిమాలో నైనా గంగూలి, సూరి జంట‌గా న‌టించారు. జ‌న‌వ‌రి 1న విడుద‌ల కాబోతోంది. ఈ సంద‌ర్భంగా చిత్ర ప్ర‌మోష‌న్స్‌ని వ‌ర్మ మొద‌లుపెట్టారు.

- Advertisement -

ఆదివారం రాత్రి `ప్రీ న్యూ ఇయ‌ర్ ప్రైవేట్ పార్టీ` పేరుతో చిత్ర బృందం అభిమానుల‌తో క‌లిసి హంగామా చేసింది. హైద‌రాబాద్‌లో నిర్వ‌హించిన ఈ వేడుక‌కు అభిమానులు పెద్ద సంఖ్య‌లో హాజ‌ర‌య్యారు. ఈ సంద‌ర్భంగా చిత్ర న‌టీన‌టులు నైనా గంగూలీ, సూరిల‌తో క‌లిసి స్టెప్పులు వేసిన ఆర్జీవీ ఉన్న‌ట్టుండి హీరోయిన్ నైనా గంగూలి కాళ్ల‌పై ప‌డ్డ‌టం ప‌లువురిని ఆశ్చ‌ర్యానికి గురిచేసింది. ది గ్రేట్ డైరెక్ట‌ర్‌గా పేరు తెచ్చుకున్న వ‌ర్మ  అక‌స్మాత్తుగా త‌న కాళ్ల‌పై స‌డి సాష్టాంగా న‌మ‌స్కారం చేయ‌డంతో నైనా గంగూలీ భావోద్వేగానికి గురై వ‌ర్మ‌ని ఆలింగ‌నం చేసుకుంది.

దీనికి స‌బంధించిన ఫొటోలు సోష‌ల్ మీడియాలో వైర‌ల్‌గా మారాయి. ఈ హ‌ఠాత్ప‌రిణామానికి షాక్‌కు గురైన నైనా గంగూలిని వ‌ర్మ ఓదారుస్తున్న వీడియో ప్ర‌స్తుతం సోష‌ల్ మీడియాలో వైర‌ల్‌గా మారింది. ఈ సంఘ‌ట‌న సినిమా ప‌బ్లిసిటీని పీక్స్‌కి తీసుకెళ్లింది. ఎంతైనా ఫ్రీ ప‌బ్లిసిటీ విష‌యంలో వ‌ర్మ‌ని మించిన మాస్ట‌ర్లు లేర‌ని, ఆయ‌న సినిమాల‌కు ఫ్రీ ప‌బ్లిసిటీ వ‌చ్చేస్తుంద‌ని సినీ జ‌నాలు అంటున్నారు. వ‌ర్మ కూడా ఈ అవ‌కాశాన్ని బాగానే వాడుకున్నార‌ని, దీంతో `బ్యూటిఫుల్ ` సినిమాకు రావాల్సిన ప‌బ్లిసిటీ వ‌ర్మ వ‌ల్లే వ‌చ్చేసింద‌ని అంతా అనుకుంటున్నారు.

- Advertisement -
Advertisement
Advertisement

టాప్ స్టోరీస్

View All
Advertisement

గాసిప్స్

View All