Homeటాప్ స్టోరీస్మరో ఐస్ క్రీమ్ ను దించనున్న వర్మ

మరో ఐస్ క్రీమ్ ను దించనున్న వర్మ

మరో ఐస్ క్రీమ్ ను దించనున్న వర్మ
మరో ఐస్ క్రీమ్ ను దించనున్న వర్మ

వివాదాస్పద దర్శకుడు రామ్ గోపాల్ వర్మ ఐస్ క్రీమ్ సిరీస్ గా రెండు కళాఖండాలను దించిన విషయం తెల్సిందే. అప్పటిదాకా చిన్న చిన్న పాత్రలు వేసుకునే తేజస్వి మడివాడను హీరోయిన్ గా పెట్టి వర్మ ఐస్ క్రీమ్ పేరుతో మొదటగా సినిమాను వదిలాడు. దాదాపు సినిమా మొత్తం ఒకే ఇంట్లో డిజిటల్ కెమెరాతో ఇద్దరే పాత్రలతో తీసిన ఐస్ క్రీమ్ మేకింగ్ పరంగా ఎందరికో స్ఫూర్తినిచ్చింది.

ఐస్ క్రీమ్ కంటెంట్ గురించి చెప్పుకోవడానికి ఏం లేదు. వింత వింత యాంగిల్స్, తేజస్వి అందాల ప్రదర్శన తప్ప ఐస్ క్రీమ్ ఎంతో మందికి తలపోటు తెప్పించింది. ఇంత నాసిరకం సినిమా తీసినా కానీ వర్మ ఏ మాత్రం దయచూపకుండా ఐస్ క్రీమ్ 2 పేరుతో మరో సినిమాను అందించాడు.

- Advertisement -

ఐస్ క్రీమ్ 2 జనాల చేత హాహాకారాలు పెట్టించింది. ఇప్పుడిప్పుడే ఆ సినిమాలను జనాలు మర్చిపోతుండగా రామ్ గోపాల్ వర్మ మరోసారి దాడి చేయబోతున్నాడు. ఐస్ క్రీమ్ 3 అంటూ మరో సినిమా తీస్తాడట. ఈసారి మరి ఎంత మంది జనాలను ఇబ్బందిపెడతాడో.

- Advertisement -
Advertisement
Advertisement

టాప్ స్టోరీస్

View All
Advertisement

గాసిప్స్

View All