Homeటాప్ స్టోరీస్వర్మ మళ్ళీ డైరెక్ట్ రిలీజ్ అంటున్నాడే!

వర్మ మళ్ళీ డైరెక్ట్ రిలీజ్ అంటున్నాడే!

వర్మ మళ్ళీ డైరెక్ట్ రిలీజ్ అంటున్నాడే!
వర్మ మళ్ళీ డైరెక్ట్ రిలీజ్ అంటున్నాడే!

రామ్ గోపాల్ వర్మకు ఇదివరకు క్రియేటివ్ డైరెక్టర్ అని పేరుండేది. కొత్త కొత్త ఐడియాస్ తో, సరికొత్త టెక్నీకల్ డీటెయిల్స్ తో సినిమాలను తెరకెక్కించడం వర్మ స్టైల్. వర్మ టేకింగ్ కు ఫ్యాన్స్ ఉండేవాళ్ళు అప్పట్లో. కానీ ఈ మధ్య వివాదాల దర్శకుడు అని పిలుస్తున్నారు. తన దగ్గర ఐడియాస్ అయిపోయాయో లేక తనకు ఇక అంతే వచ్చు అని ఫీల్ అవుతున్నాడో తెలీదు కానీ వర్మ నుండి మంచి సినిమా వచ్చి చాలా కాలమైంది. లక్ష్మీస్ ఎన్టీఆర్ వంటి సినిమాలు ఉన్నాయి కానీ అవి వివాదాలతో క్రేజ్ సంపాదించుకుని క్యాష్ చేసుకున్నవే. ఏవో ఒక మాటల గారడీలతో, వివాదాలతో ఎప్పుడూ వార్తల్లో ఉండడం, అప్పుడే సినిమాలను ప్రకటించడం, మళ్ళీ దాన్ని క్యాష్ చేసుకోవడానికి కొత్త వివాదాలు సృష్టించడం, ఇవన్నీ వర్మకు ఈ మధ్య బాగా అలవాటుగా మారిపోయాయి.

ఇదివరకు వర్మ చేస్తే వివాదం అయ్యేది కానీ ఇప్పుడు వివాదాన్నే కథావస్తువుగా తీసుకుంటున్నాడు. లక్ష్మీస్ ఎన్టీఆర్ సినిమాతో చంద్రబాబు అండ్ కో మీద వేయాల్సినన్ని పంచ్ లు వేసిన వర్మ, ఇంకా వాళ్ళ మీద కోపం చల్లారినట్లు లేదు. అందుకే కమ్మ రాజ్యంలో కడప రెడ్లు అనే సినిమాను రూపొందించాడు. ఆ తర్వాత ఈ టైటిల్ ను అమ్మ రాజ్యంలో కడప బిడ్డలు అని టైటిల్ కూడా మార్చాడు లెండి. మొత్తం ఆంధ్రప్రదేశ్ రాజకీయాల మీదే వ్యంగ్యాస్త్రంగా ఈ సినిమాను రూపొందించినట్లు తెలుస్తోంది. అయితే ఎంత సెటైర్ అయినా ఇది కూడా జగన్ కు ఫెవర్ గానే తీసాడు. లక్ష్మీస్ ఎన్టీఆర్ అంటే వైఎస్సార్సీపీ నాయకుడు నిర్మాత కాబట్టి జగన కు ఫెవర్ గా తీశాడన్నా అర్థముంది. కానీ ఈ అమ్మ రాజ్యంలో కడప రెడ్లలో కేవలం చంద్రబాబు మీదే కాక లోకేష్, పవన్ కళ్యాణ్, కెఏ పాల్ అంటూ ఎవరినీ వదిలిపెట్టలేదు. అందరి మీదా సెటైర్లు వేసేశాడు.

- Advertisement -

సో ఆటోమేటిగ్గా వివాదాలు ఈ చిత్రాన్ని చుట్టుముట్టాయి. చాలా మంది ఈ సినిమా రిలీజ్ ను ఆపాలంటూ కోర్టు మెట్లు కూడాఎక్కారు. కెఏ పాల్ కూడా ఈ సినిమా ఎలా విడుదలవుతుందో చూస్తాను అంటూ సవాల్ చేసాడు. టైటిల్ మార్చినా కూడా ఈ వివాదాలు చూసి సెన్సార్ సభ్యులు క్లియరెన్స్ ఇవ్వడానికి జంకారు. నవంబర్ 29న విడుదల కావాల్సిన ఈ చిత్రం ఇప్పుడు విడుదల కాకుండా ఆగిపోయింది. ఎప్పుడు సెన్సార్ క్లియరెన్స్ ఇస్తారు, ఎప్పుడు విడుదల చేస్తారు అన్న దానిపై ఇంకా ఎటువంటి అధికారిక సమాచారం లేదు. చూస్తుంటే ఈ సినిమా విడుదల కష్టమే అనిపిస్తోంది. అయితే వర్మ అంత తేలిగ్గా లొంగే రకం కాదుగా. ఈ సినిమాకు థియేట్రికల్ రిలీజ్ దొరక్కపోతే డైరెక్టుగా డిజిటల్ రిలీజ్ చేయాలని కూడా ఆలోచిస్తున్నట్లు సమాచారం. మరి ఈ సినిమా భవితవ్యం చివరికి ఏమవుతుందో తెలియాలంటే మరికొంత కాలం ఆగక తప్పదు. దీంతో పాటు వర్మ దించిన బ్యూటిఫుల్ చిత్రానికి సెన్సార్ క్లియరెన్స్ వచ్చేయడం గమనార్హం. ఈ సినిమాకు A సర్టిఫికెట్ ఇచ్చేసారు. అయితే రిలీజ్ ఎప్పుడన్నది ఇంకా క్లారిటీ లేదు.

- Advertisement -
Advertisement
Advertisement

టాప్ స్టోరీస్

View All
Advertisement

గాసిప్స్

View All