Homeటాప్ స్టోరీస్వర్మ గారు మీరు మామూలు వారు కాదండీ బాబు..

వర్మ గారు మీరు మామూలు వారు కాదండీ బాబు..

వర్మ గారు మీరు మామూలు వారు కాదండీ బాబు..
వర్మ గారు మీరు మామూలు వారు కాదండీ బాబు..

తరతరాల నుండి చూసుకుంటే గడిచిన కొన్ని సంవత్సరాలుగా తెలుగు తెరని ఆకాశానికి తీసుకెళ్ళాలని తపన పడే వారిలో మన ‘రామ్ గోపాల్ వర్మ‘ గారు ఒకలు. కొంతమంది దర్శకులు వారు తీసిన సినిమాలా ద్వారా ఆకశానికి తీసుకొని వెళ్తే వర్మ గారి స్టైల్ వేరు. ఆయన మాటలు, వేసే పంచులు, చేసే ట్వీట్లు ఇండియా మొత్తం గా పాపులర్ అవుతాయి. అందుకే ఆయనకి సినిమాల పరంగా కాకుండా వ్యక్తి పరంగా ఎక్కువ అభిమానులు ఉంటారు. వర్మ గారు మన తెలుగు పరిశ్రమ కి చెందిన వారు కనుక మన తెలుగు పరిశ్రమ అలా పేరు సంపాదించుకుంటుంది.

సినిమా షూటింగ్ గురించి ఒక్క అప్డేట్ కూడా ఇవ్వడు. పాట కానీ, ట్రైలర్ కానీ విడుదల చేసే సమయానికి అప్పుడు తెలుస్తుంది. ఓహో! వర్మ గారు ఇప్పుడు ఈ సినిమా చేస్తున్నారా? అని. ఒక్కరోజులో చెప్పేస్తాడు వెంటనే సినిమా విడుదల చేసేస్తాడు. అందుకే ఈ మధ్య ఆయన సినిమాలు కొంచెం కూడా ఆధారణ పొందలేకపోతున్నాయి. వ్యక్తిగా తనంటే ఎంతో మందికి ఇష్టం. కానీ అలాంటి వ్యక్తి ఇలాంటి సినిమాలు చేయడం ఏంటి? అని ఆయన గురించి తెగ ఆలోచిస్తున్నారు జనాలు. ఆయన పక్కన చాలా మంది అసిస్టెంట్ డైరెక్టర్స్ ఉంటారు. అందువలన వారితో కొన్ని సన్నివేశాలు కూడా డైరెక్ట్ చేయించుకుంటారు.

ఈ సంవత్సరం మొదట్లో ‘చంద్రబాబు నాయుడు’ గారి మీద కక్షతో ”లక్ష్మీ’స్  ఎన్. టి. ఆర్” సినిమాని వదిలాడు. ‘ఎన్. టి. ఆర్’ గారిని ఎదురుదెబ్బ తీయడం రాజకీయాలలోకి ఎలా వచ్చాడో? అనే దాని మీద సినిమా తీయడం వలన జనాలకి కూసింత ఎక్కువగానే ఆసక్తి వచ్చింది. అయితే సినిమా షూటింగ్ అయిపోయింది. సినిమాని తెలంగాణ లో విడుదల చేసారు కానీ ఆంధ్రాలో విడుదల అవ్వకుండా చేసారు అని వర్మ గారు తెగ బాధ పడ్డారు. ‘లక్ష్మీ’స్  ఎన్. టి. ఆర్’ సినిమా జనాలకి నచ్చలేదు. కారణం పావలా కారెక్టర్ ఆర్టిస్ట్ లని పెట్టి తియ్యడం వలన సినిమా బాగున్నా, లేకున్నా జనాలు చూడలేకపోయారు.
లక్ష్మీ’స్  ఎన్. టి. ఆర్ సినిమా అయిపోయిన వెంటనే ‘కమ్మ రాజ్యంలో కడప రెడ్లు’ సినిమాని ప్రకటించేశారు. అందులో కూడా మరలా పావలా కారెక్టర్ ఆర్టిస్ట్ లనే పెట్టి మమా అనిపిస్తున్నారు. చేసిన తప్పునే మళ్ళీ చేస్తున్నారు అని కొంతమంది వ్యతిరేకిస్తున్నారు. కొంతమంది మద్ధతు తెలుపుతున్నారు. కమ్మ రాజ్యంలో కడప రెడ్లు సినిమా గురించి ఆసక్తిగా జనాలకి ఒక  పాటని విడుదల చేసారు. ఆ పాటలలో కూడా మన వర్మ గారి గొంతు ఉండటం వలన అసలు ఇది సినిమాలోని పాట కాదు అనుకున్నారు. ఎందుకంటే ఆ పాటలో ఎక్కువగా ‘చంద్రబాబు నాయుడు’ మరియు  ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి ‘వై. ఎస్. జగన్ మోహన్ రెడ్డి’ గారి పేపర్ ఫోటోస్ పెట్టేసారు. చరిత్రలో వారిని అలా వాడుకోవడం మొదటి సారి వర్మ గారి వలనే జరిగినది.

- Advertisement -

అసలు కమ్మ రాజ్యంలో కడప రెడ్లు సినిమా లో కూడా చంద్రబాబు నాయుడు , వై. ఎస్. జగన్ మోహన్ రెడ్డి గురించి చెప్పబోతున్నాడు అని మన అందరికీ ముందే తెలుసు. ఇకపోతే ”దీపావళికి సినిమా నుండి ట్రైలర్ రిలీస్ చేస్తున్న కాచుకోండి” అని ఒక ట్వీట్ వదిలారు. ఇక అంతే  చంద్రబాబు గారికి వ్యతిరేకమైన కొంత మంది వర్మ గారిని తెగ పొగిడేస్తున్నారు. మరి చూద్దాం ఈసారైనా మన వర్మ గారికి సినిమా విజయం దక్కుతుందో? లేదో?  ఏదేమైనా ఇంకొక సినిమా తియ్యడం మాత్రం ఆయన మానుకోలేరు….అందుకే వర్మ గారిని సార్ మీరు మామూలు వారు కాదు సార్ అంటారు.

- Advertisement -
Advertisement
Advertisement

టాప్ స్టోరీస్

View All
Advertisement

గాసిప్స్

View All