బాహుబలి చిత్రంలో అసలు శివగామి గా శ్రీదేవి నటించాల్సి ఉండే కానీ ఆమె నటించకపోవడానికి కారణం ఎవరో తెలుసా …… ఆమె భర్త బోనీ కపూర్ అంటూ సంచలన వ్యాఖ్యలు చేసాడు వివాదాస్పద దర్శకులు రాంగోపాల్ వర్మ . బాహుబలి చిత్రంలో శివగామి పాత్రకు మొదట శ్రీదేవి నే ఎంచుకున్నారు దర్శకులు రాజమౌళి , ఆమె కూడా నటించడానికి ఉత్సాహం చూపించింది కూడా కానీ శ్రీదేవి భర్త బోనీ కపూర్ మాత్రం శ్రీదేవి డేట్స్ ఇవ్వాలంటే ఎక్కువ రెమ్యునరేషన్ ఇవ్వాలని పలు కండీషన్ లు పెట్టారట దాంతో రాజమౌళి అండ్ కో భయపడిపోయి శ్రీదేవి స్థానంలో రమ్యకృష్ణ ని ఎంచుకున్నారు .
శ్రీదేవి పెళ్లి చేసుకున్న తర్వాత సుఖంగా లేదని , ఈ విషయాన్నీ అలాగే బాహుబలి లోని శివగామి పాత్ర గురించి నాకు రెండుమూడు సార్లు చెప్పిందని బోనీ వల్లే చేయలేకపోయిందని సంచలన ఆరోపణలు చేసి మరోసారి నిప్పు రాజేసాడు వర్మ . శ్రీదేవి కి వర్మ పెద్ద అభిమాని అలాగే ఆమెని ఎంతగానో ఆరాధించేవాడు . అయితే వర్మ చేసిన ఆరోపణలపై బోనీ ఎలా స్పందిస్తాడో చూడాలి .