Homeటాప్ స్టోరీస్వ‌ర్మ‌కు గేలా మారాల‌ని వుంద‌ట‌!

వ‌ర్మ‌కు గేలా మారాల‌ని వుంద‌ట‌!

వ‌ర్మ‌కు గేలా మారాల‌ని వుంద‌ట‌!
వ‌ర్మ‌కు గేలా మారాల‌ని వుంద‌ట‌!

వివాదాన్ని సైతం త‌న‌కు అనుకూలంగా మ‌లుచుకోవ‌డంతో వ‌ర్మ‌ని మించిన వాళ్లు లేరు వుండ‌రు కూడా. కాంట్ర వ‌ర్శీలంటే వ‌ర్మ వ‌ర్మ అంటేనే కాంట్ర‌వ‌ర్శీ.. అలా మారిపోయారు. సినిమాల‌తో త‌క్కువ‌గా, ట్వీట్‌ల‌తో ఎక్కువ‌గా పాపుల‌ర్ అవుతున్న రామ్‌గోపాల్‌వ‌ర్మ తాజాగా ఎన్టీఆర్ బ‌ర్త్‌డే సంద‌ర్భంగా పెట్టిన పోస్ట్ వైర‌ల్‌గా మారింది.

యంగ్‌టైగ‌ర్ ఎన్టీఆర్‌ని విష్ చేస్తూనే వ‌ర్మ త‌న‌దైన శైలిలో స్పందించారు. యంగ్‌టైగ‌ర్ సిక్స్‌ప్యాక్ పిక్‌ని పోస్ట్ చేసి ఆ ఫొటోకి, ఎన్టీఆర్ ఫిజిక్‌కి ఫిదా అయిపోయారు. ఈ సంద‌ర్భంగా వ‌ర్మ `నేను స్వ‌లింగ సంప‌ర్కుడిని కాద‌ని మీకు బాగా తెలుసు. కానీ ఈ ఫొటోలో ఎన్టీఆర్‌ని చూసిన త‌రువాత నేను అలా కావాల‌ని అనుకుంటున్నాను. ఆ బాడీ యేంట్రా నైనా..` అని ట్వీట్ చేశారు వ‌ర్మ‌.

- Advertisement -

ఈ ట్వీట్ చూసిన వారంతా అవాక్క‌వుతున్నారు. ఎన్టీఆర్‌ని వ‌ర్మ పొగిడిన తీరు అర్థం కావ‌డంతో న‌వ్వుకుంటున్నారు. రామ్‌గోపాల్‌వ‌ర్మ తాజా సెన్సేష‌న్ `క్లైమాక్స్‌`. పోర్న్ స్టార్ మియా మాల్కోవా కీల‌క పాత్ర‌లో తెర‌కెక్కిన ఈ చిత్రాన్ని RGVWorldTheatreలో ఈ నెల 29న ఉద‌యం 11 గంట‌ల‌కు రిలీజ్ చేస్తున్నారు. టీజ‌ర్‌తోనే సంచ‌ల‌నం సృష్టించిన వ‌ర్మ సినిమాతో ఎలాంటి క్లైమాక్స్‌ని డిసైడ్ చేశాడో తెలియాలంటే ఈ నెల 29 ఉద‌యం 11 గంట‌ల వ‌ర‌కు వేచి చూడాల్సిందే.

- Advertisement -
Advertisement
Advertisement

టాప్ స్టోరీస్

View All
Advertisement

గాసిప్స్

View All